Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జిల్లా కలెక్టర్‌కు సీపీఐ(ఎం) వినతి
నవతెలంగాణ-గార్ల
మండల కేంద్రంలోని ప్రభు త్వ ఆస్పత్రిలో వైద్య సౌకర్యాలు మెరుగుపర్చాలని సీపీఐ(ఎం) జిల్లా నాయకులు కందునూరి శ్రీనివాస్ జిల్లా కలెక్టర్ శశాంక్‌ను కోరారు. మండలంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తనిఖీ నిమిత్తం వచ్చిన జిల్లా కలెక్టర్ శశాంక్‌కు పార్టీ ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. ముప్పై పడకల ఆసుపత్రి నిర్మాణం పూర్తై రెండేండ్లు గడచినా అధునాతన వైద్య పరికరాలు ఏర్పాటు చేయలేదన్నారు. ఒకరు మాత్రమే వైద్య అధికారి, నామమాత్రపు వైద్య సిబ్బంది ఉండటంతో ప్రజలకు ప్రభుత్వ వైద్యం అందని ద్రాక్ష లాగా మారుతోందని ఆందోళన వెలిబుచ్చారు. గతేడాది మండలంలో అధికంగా విషజ్వరాల బారిన పడి మరణాలు ఎక్కువగా సంభవించాయని గుర్తు చేశారు. ప్రస్తుతం వర్షా కాల సీజన్ కావడంతో ఏజెన్సీ ప్రాంతమైన మండలంలో ప్రజలకు ప్రభుత్వం వైద్యం అందించడానికి ముప్పై పడకల ఆసుపత్రి లో వైద్య పరికరాలు, మహిళ వైద్యురాలు, వైద్య సిబ్బందిని ఏర్పాటు చేసి ప్రజలకు ప్రభుత్వ వైద్యం అందించాలని కోరారు. వినతిపత్రం అందజేసిన వారిలో మండల కార్యదర్శి గిరిప్రసాద్, నాయకులు రామకృష్ణ, ఎల్లయ్య తదితరులు ఉన్నారు.