Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రూ.10 లక్షలు పలుకుతున్న వైనం !
నవతెలంగాణ-గణపురం
గణపురం తాహసిల్ధార్ పోస్ట్ కోసం భారీ పైరవీలు జరు గుతున్నాయి. రూ.10లక్షలు ఇచ్చైనా పోస్టును తీసుకునేందుకు కొందరు తహసీల్దార్లు ఒక మంత్రి, ఎమ్మెల్యేల చుట్టూ తిరుగుతున్నట్లు సమాచారం. గణపురం తహసీల్దార్‌గా 6 నెలల క్రితం కృష్ణచైతన్య బాధ్యతలు తీసుకున్నాడు. ఆయనకు గణపురం మండలంపై ఇష్టం లేక పోవడంతో గణపురం వచ్చే ముందే తనకు బదిలీ కావాలని కలెక్టర్‌కు లెటర్ పెట్టుకున్నట్టు సమాచారం. దీంతో ఆయన కు బదిలీ ఆర్డర్ కాపీ రావడంతో ఆయన వెళ్లిపోయేందుకు సిద్ధమయ్యాడు. దీంతో కొందరు తహసీల్దార్లు గణపురం వచ్చేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. మండలంలో సింగరేణి ఓసి త్రీ కింద భూములు పోతు న్నాయి. నగరంపల్లి, మాధవరావుపల్లి, గుండంపల్లి, తదితర భూములు పోతుండగా ఆ సర్వేను సింగరేణి అధికారులు త్వరగా చేయాలని రెవెన్యూ అధికారులకు ఆదేశించడంతో రెవెన్యూ అధికారులు సర్వే చేసేందుకు పావులు కదుపుతున్నారు. ఈ సర్వేలో లావాదేవీలు భారీగా ఉంటాయని అనుకున్న తహసీల్దార్లు గణపురం వచ్చేందుకు జిల్లాలోని ఒక మంత్రి అధికార పార్టీ ఎమ్మెల్యేలతో తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. కాగా భూములు కోల్పోతున్న భూనిర్వాసితులు ఓ తాహాసిల్దార్ ను రప్పిం చుకునేందుకు అధికార పార్టీ ఎమ్మెల్యేలతో ముమ్మర ప్రయత్నం చేస్తున్న ట్లు సమాచారం. ఆ తాహసిల్దార్ బాధ్యతలు చేపడితే ఆయనకు అన్ని పనులు జరుగుతాయనే ఉద్దేశంతో అధికారం, రాజకీయ హంగులు ఉప యోగించి తాను అనుకున్న తహసీల్దార్‌ను తీసుకొచ్చేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. కాగా ఆ తాసిల్దార్ లు గతంలో ఈ మండలంలో లో పనిచేసి బదిలీపై వెళ్ళినవారు కావడం విశేషం.