Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి బందు సాయిలు
నవతెలంగాణ-భూపాలపల్లి
మూడు రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల పంటలు దెబ్బతిని నష్టపోయిన రైతుల కు నష్టపరిహారం ఇవ్వాలని, ఇండ్లు కూలి పోయిన ప్రజలను ఆర్థికంగా ఆదుకోవాలని, మండలంలో అసైన్డ్ , పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని సీపీఐ(ఎం) జిల్లా కార్య దర్శి బందు సాయిలు కోరారు. మంగళ వారం భూపాలపల్లి తాసిల్దార్ కార్యాలయం లో వినతిపత్రం అందించి ఆయన మాట్లా డారు. వర్షాల కారణంగా భూపాలపల్లి మండలం అనేక గ్రామాల్లో ఇళ్లు కూలిపో యి బాధితులు అనేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. పంటలు నీటిలో మునిగి పంట నష్టం వాటిల్లిందని, తక్షణమే రైతులను ప్రజలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. భూములు సాగులో ఉన్న రైతులం దరికీ పట్టాలు ఇచ్చి రైతుబంధు అమలు చే యాలన్నారు. పోడు భూములు దున్ను కోవడానికి ట్రాక్టర్లకు అనుమతి ఇవ్వాలని, ఫారెస్ట్ అధికారులు పెట్టిన అక్రమ కేసులు ఎత్తి వేయాలన్నారు. ఫారెస్ట్ అధికారులు స్వాధీనం చేసుకున్నా భూములను తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు. నష్టపోయిన పంటకు ఎకరానికి రూ.5 లక్షలు ఇవ్వాలని, రైతుల భూములకు పట్టాలు లేకపోయినా నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికి డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలని, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను వేగవంతంగా పూర్తి చేయాలనానరు. దళితులకు 3 ఎకరాల భూమి ఇవ్వాలని డిమాండ్ చేశారు. పల్లె ప్రకతి వనాలు, స్మశానవాటికల పేరుతో దళిత ,గిరిజనుల భూములు గుంజు కోవడం అన్యాయమని, వారి భూములు వారికి తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రజా సమస్యలు పరిష్కరించకోవడం దుర్మార్గమని అన్నారు. రాబోయే రోజుల్లో పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు నిర్వహిస్తా మని హెచ్చరించారు. నాయకులు వెలిశెట్టి రాజయ్య, కంపేటి రాజయ్య పాల్గొన్నారు.