Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-భూపాలపల్లి
పలిమెల, మహాదేవపూర్, మహాము త్తారం మండలంలో ప్రయోగాత్మకంగా ఫోర్టిఫైడ్ (బలవర్థకమైన) బియ్యాన్ని చౌక ధరల దుకాణాల ద్వారా పేదలకు అందిం చాలని జేసీ కూరాకుల స్వర్ణలత అధికారుల ను ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలోని జేసీ చాంబర్లో పౌరసర ఫరాల, రెవెన్యూశాఖల అధికారులతో సమావేశం నిర్వహించి జేసీ మాట్లాడారు. ఫోర్టిఫైడ్ బియ్యం పంపిణీ చేసేందుకు పైలెట్ జిల్లాగా మన జిల్లా ఎంపికైందని ముందస్తుగా పలిమెల, మహాదేవపూర్, మహాముత్తారంలో ప్రయోగాత్మకంగా బియ్యాన్ని అందిస్తారన్నారు. ఈ నెల నుండి బియ్యం పంపిణీ చేయాలని ఆదేశించారు. ఫోర్టిఫైడ్ బియ్యం వినియోగంతో అనీమి యాను అధిగమించొచ్చన్నారు. రక్తహీనత ను తగ్గిస్తుందని, ఫోలిక్ యాసిడ్ గర్భస్థ శిశువు అభివృద్ధి చెందడంలో సహాయపడు తుందన్నారు. ఈ బియ్యంపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఫోర్టిఫైడ్ బియ్యం నిల్వ గదుల్ని పటిష్ట ఏర్పాటుకు ప్రత్యేక చర్యలు తీసుకునేలా అవగాహన కల్పించాలన్నారు. జిల్లా పౌరసరఫరాల అధికారి గౌరీ శంకర్, పౌరసరఫరాలశాఖ మేనేజర్ రాఘవేందర్, ఏఎస్ఓ ముక్తార్, సివిల్ సప్లై డీటీ మల్లేష్, మూడు మండలాల డిప్యూటీ తాసిల్ధార్లు, సీనియర్ అసిస్టెంట్లు, తదితరులు పాల్గొన్నారు.