Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కలెక్టరేట్
రక్తదానం ప్రాణ దానంతో సమానమని జిల్లా కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు అన్నారు. మంగళవారం కలెక్టరేట్ కార్యాల యంలో డీఆర్డీఓ, రెడ్ క్రాస్ సంయుక్త ఆధ్వ ర్యంలో నిర్వహించిన మెగా రక్తదాన శిబిరం ఆయన ప్రారంభించి మాట్లాడారు. ప్రజలు స్వచ్ఛందంగా రక్త దాతలుగా ముందుకు రావాలన్నారు. సేవా కార్యక్రమాలు చేపడుతున్న ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీని అభినందించారు. రక్తం ఇవ్వడం వల్ల ఆరోగ్య సమస్యలు ఉండవని అన్నారు. ఈ శిబిరంలో 106 మందికి పైగా రక్తదానం చేశారు. డీిఆర్డీఏ కార్యాలయ 12 విభాగాలు, సెర్ఫ్, పిన్షన్ సిబ్బంది తో పాటుహసన్ పర్తి, సిద్దాపూర్ గ్రామాలకు చెందిన 30మంది యువకులు రక్త దానం చేశారు. అనంతరం రక్త దాతలకు పండ్లు, ఎనర్జీడ్రింక్లతోపాటు సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డిఆర్డీఓ శ్రీనివాస్ కుమార్, డీపీఓ జగదీశ్వర్, రెడ్ క్రాస్ చైర్మెన్ విజరుచందర్రెడ్డి, పాలకమండలి సభ్యులు శ్రీనివాస్‌రావు, జిల్లా తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసి యేషన్ అధ్యక్షులు జగన్మోహన్ రావు, టీఎన్జీవో అసోసియేషన్ అధ్యక్షులు రాజేందర్ పాల్గొన్నారు