Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పోచమ్మ మైదాన్
వరంగల్ మహానగరపాలక సంస్థ పరిధి పలు కాలనీలు, రోడ్లు భారీ వర్షాలవల్ల జలమయమై చెరువు లను తలపిస్తున్నాయి. ముంపు ప్రాంతాల కాలనీల్లోకి నీళ్లు చేరాయి. 14 వ డివిజన్ ఎస్సార్ నగర్లో బడి పూర్తిగా వరద నీటిలో మునిగిపోయింది. పలు కాలనీల ప్రజలను పునరావాస కేంద్రాలకు ముందస్తు గానే అధికారులు పంపించే ఏర్పాటు చేసినప్పటికీ కొందరు వరద ముంపులో చిక్కుకున్నారు. హంటర్ రోడ్ బందావన్ కాలనీ, వాంబే కాలనీ, రామన్నపేట ఎస్సార్ నగర,్ మధుర కాలనీ, లక్ష్మీగణపతి కాలనీలో వరద తీవ్రత ఇప్పటికీ తగ్గలేదు. కాజీపేట దర్గా, కాకాజీ కాలనీ, అంబేడ్కర్ విగ్రహం దగ్గర కొన్ని చెట్లు విరిగి పడటం వల్ల ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. డిఆర్ఎఫ్ బృందం చెట్లను తొలగించే ఏర్పాట్లు చేశారు. బల్దియా మేయర్, కమిషనర్లు హంటర్‌రోడ్డు బృందావన్ కాలనీలో చిక్కుకున్న వరద బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించే ఏర్పాట్లు చేయడం గమనార్హం. అయినప్పటికీ గ్రేటర్‌కు వరద ముప్పు రాకుండా చర్యలు తీసుకోవడంలో అధికారులు విఫలమైన పరిస్థితి. గతేడాది వర్షాల వల్ల పలు కాలనీలు నీట మునిగితే మంత్రి కేటీఆర్, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ వరంగల్ వచ్చి బాధితులకు అండగా ఉంటామని చెప్పారు. మరో సారి వరద ముప్పు రాకుండా తగు చర్యలు తీసుకోవాలని అధికారులకు చెప్పారు. ఏడిది గడిచినా ఎక్కడి పనులు అక్కడే ఉన్నాయి. పనులు టెండర్ దశలో ఉండటం గమనార్హం. వాన వచ్చిందంటే వరద ముప్పు తప్పటం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తు న్నారు. పాలకులు, అధికారులు పట్టించుకుని వరద ముంపు రాకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
వాన వస్తుందంటే భయమే
: అరూరి కోమల, ఓఎస్నగర్
వరద వస్తుందంటే ఏ పునరావాస కేంద్రాలకు వెళ్లాలో అని భయం వేస్తోంది. నగరంలో డ్రయినేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండడంతో చిన్న వర్షానికే నగరం బురదమయం అవుతోంది. ఇంట్లోకి వరదనీరు, మురు గు నీరు చేరి విషజ్వరాల బారినపడుతున్నాం. అధికా రులు స్పందించి వరద ముప్పు నుంచి కాపాడాలి.
హసన్‌పర్తి : మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో మండలంలలోని 10 విలీన గ్రామాలతో పాటు 15 ప ంచాయతీ గ్రామాలలో ముంపు ప్రాంతాల లోకి వరద నీరు చేరింది. సీతంపేట, గంటూర్‌పల్లి చెరువుల నుంచి మత్తడి ద్వారా ప్రవహిస్తున్న నీరు ఆయా గ్రామాల ప్రజల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. చింతగట్టు క్యాంపులోని ఔటర్ రింగ్ రోడ్డు బ్రిడ్జి వద్ద పెద్ద ఎత్తున వరద నీరు చేరడంతో కరీంనగర్-హన్మకొండ ప్రధాన రహదారిపై రెండు రోజుల నుంచి రాకపోకలకు అంతరాయం ఏర్పడడంతో ట్రాఫిక్ పోలీసులు చర్యలు తీసుకున్నారు. సిద్దాపూర్ లోని ఎస్బీఐ బ్యాంకులోకి వరదనీరు చేరడంతో బ్యాంకు గదులు పూర్తిగా నీటితో నిండిపోయి ఖాతా దారులు, బ్యాంకు అధికారులు ఇబ్బందులు పడ్డారు. హసన్‌పర్తి ఆర్టీసీ కాలనీలోకి నల్లగట్టు గుట్ట నుంచి వస్తున్న వరదనీరుతో కాలనీలలో రాకపోకలకు అంత రాయం ఏర్పడింది. యాదవనగర్, బంజెరుదొడ్డి కాలనీలలో ఇండ్లలోకి వరదనీరు చేరి కాలనీ వాసులు ఇబ్బందులకు గురయ్యారు. ముంపు ప్రాంతాలలోకి వరదనీరు చేరకుండా కాలువలు ఏర్పాటు చేయక పోవడంతోనే ఇబ్బందులు పడుతున్నట్లు పలువురు ఆరోపిస్తున్నారు. అధికారులు ముంపు ప్రాంతాలను గుర్తించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
సీతంపేటలో బ్రిడ్జి ఏర్పాటు చేయాలి : సర్పంచ్
వర్షాకాలంలో వరద నీరు చేరడంతో సీతంపేట చెరువు మత్తడి ఉదృతి పెరగడంతో పలు గ్రామాల మద్య రాకపోకలు స్తంభించి పోయి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని సీతంపేట సర్పంచ్ జనగాం శరత్ కుమార్ అన్నారు. సీతంపేట చెరువు మత్తడి వద్ద బ్రిడ్జి ఏర్పాటు చేసి సమస్యను పరిష్కరించాలని ఎమ్మెల్యే ఆరూరి రమేష్‌ను కోరారు.
మండలంలో సంతరించుకున్న జలకళ
రాయపర్తి : ఎడతెరిపి లేని వర్షాలతో మండలంలో జలకళ సంతరించుకుంది. పలు గ్రామా ల్లోని చెరువులు, కుంటలు, చెక్‌డ్యామ్‌లు అలుగులు పోస్తున్నాయి. మంగళవారం ఎస్సారెస్పీ ఈఈ రమేష్ బాబు మైలారం ఎస్సారెస్పీ బ్యాలెసింగ్ రిజర్వాయరును పరిశీలించారు. సన్నూరు, ఉకల్, రాయపర్తి, కొండూరు వివిధ గ్రామాల్లోని చెరువులను పరిశీలించారు. మత్స్య కారులు చేపల వేటకు వెళ్లకూడదని హెచ్చరించారు. ఎస్సారెస్పీ డీఈ కిరణ్ కుమార్, ఏఈలు బాలదాసు, సునీత, సిబ్బంది యాకయ్య, రాజు, నవీన్ పాల్గొన్నారు.
మండల కేంద్రానికి రాకపోకలు బంద్
నల్లబెల్లి : అల్పపీడన ప్రభావంతో తీవ్రంగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నల్లబెల్లి మండలం లోని నందిగామ, మేడిపల్లి, రాంపూర్, గ్రామాల మధ్య ఉన్న లో లేవల్ బ్రిడ్జిల ద్వారా ఉదతంగా వరద నీరు ప్రవహించడంతో మండల కేంద్రానికి రాకపోకలు స్తంభించాయి.
నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి ఆదేశాలతో సమాచారం తెలుసుకున్న ఎంపీపీ సునీత ప్రవీణ్, డిటిడిఒ జమినుద్దీన్, తహసిల్దార్ ప్రవీణ్‌కు మార్, ఎంపీడీవో విజరుకుమార్లతో కలిసి నందిగా మ, రేలకుంట, మేడపల్లి, వెంకటపాలెం చెరువు, మత్తడి స్వయంగా పరిశీలించారు.