Authorization
Mon Jan 19, 2015 06:51 pm
లోతట్టు ప్రాంతాలు జలమయం
ఉధృతంగా ప్రవహిస్తున్న
కాళేశ్వరం గోదావరి
కాజ్ వేల వద్ద నిలిచిపోయిన రాకపోకలు
నీటమునిగిన పంట పొలాలు
సింగరేణిలో నిలిచిన బొగ్గు ఉత్పత్తి
అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలి
ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణ రెడ్డి
అందుబాటులో ఉండి ఆదుకుంటాం
మున్సిపల్ చైర్పర్సన్ వెంకటరాణి
నవతెలంగాణ-భూపాలపల్లి
మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జిల్లాలోని కాళేశ్వరం ప్రాజెక్టు పరవళ్ళు తొక్కు తోంది. జిల్లాలోని వాగులు వంకలు పొంగిపొర్లు తున్నాయి. గణపురం మండలంలో గణపసముద్రం మత్తడి పడడంతో మోరంచవాగు ఉధృతంగా ప్రవహి స్తోంది. సీతారాంపురం,కొండాపూర్ గ్రామాలకు రాక పోకలు నిలిచిపోయాయి. సింగరేణి ఉపరితల గను ల్లోకి భారీగా వచ్చి చేరిన వరద నీరుతో ఉత్పత్తి నిలిచి పోయింది. ఓపెన్ కాస్ట్బి2 లో బొగ్గు ఉత్పత్తికి అంత రాయం సుమారు4 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి ఆటంకం కలిగింది. ఓపెన్ కాస్ట్ బీ3లో నిలిచిపోయిన మట్టి తవ్వకాలు పూర్తిగా నిలిచిపోయాయి. తాడిచెర్ల ప్రయివేట్ ఉపరితల బొగ్గు గనిలో కూడా బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. చిట్యాల మండల కేంద్రంలో పలు ఇళ్లలోకి వరద నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బం దులు ఎదుర్కొన్నారు. మహముత్తరం మండలంలో పోతులవాగు పొంగి ప్రవహిస్తూ ఉండడంతో రాకపో కలు నిలిచిపోయాయి. కాళేశ్వరం బ్యాక్ వాటర్ వల్ల మహదేవ్పూర్ మండలం బొమ్మపూర్లో నీట మునిగిన పత్తి చేన్లు, కాటారం మండలంలో ఉప్పొంగి ప్రవహి స్తున్న బొప్పరం వాగు, పల్లి వాగుల వల్ల పంట నష్టం జరిగినట్లు సమాచారం.
జిల్లాలో నమోదైన వర్షపాతం
జిల్లా వ్యాప్తంగా 1424.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. భూపాలపల్లి 147.6, గన్ పూర్286.8, రేగొండ 259.0, మొగుళ్లపల్లి 235.2, చిట్యాల 252.2, మల్హర్రావు 33.8, కాటారం 71.6, మహా ముత్తారం 88.2, మహదేవపూర్ 49.6. నమోదయింది. మహారాష్ట్ర, తెలంగాణ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలతో కాళేశ్వరం, గోదావరి నది ఉధతంగా ప్రవహిస్తుంది దీంతో మేడిగడ్డ బ్యారేజీ నిండుకుండ కళకళలాడుతు కాళేశ్వరం వద్ద 10.550 మీటర్ల ఎత్తుతో గోదావరి నది ప్రవహిస్తుందని సీడబ్ల్యూసీ అధికారులు తెలిపారు. అన్నారం బ్యారేజీ గేట్లు ఎత్తివేయడంతో మద్దులపల్లి, సండ్రపలి,్ల అన్నా రం గ్రామాల్లో పంట పొలాలు మునిగిపోయాయి.
సింగరేణిలో నిలిచిన బొగ్గు ఉత్పత్తి
భూపాలపల్లి ఏరియాలోని కాకతీయఖని ఓసి 2,3 గనులలో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో బొగ్గు ఉత్పత్తికి విఘాతం కలిగింది. సోమవారం, మంగళవారం కురిసిన వర్షం కారణంగా గనులలోకి నీరు చేరడం వల్ల ఉత్పత్తి స్తంభించింది. రోజుకి ఓసి గని ఉత్పత్తి లక్ష్యం 3,077 టన్నులు కాగా సోమవారం ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది, మంగళవారం ఉదయం షిఫ్ట్‌లో కూడా ఉత్పత్తి స్తంభించింది. మొత్తంగా రెండు ఓపెన్ కాస్ట్ గనులలో కలిసి 8,202 టన్నుల ఉత్పత్తి నిలిచి పోయింది. చిట్యాల మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ ఎదురుగా నూతనంగా నిర్మాణం చేస్తున్న డబుల్ రోడ్డు గత రాత్రి కురిసిన భారీ వర్షానికి రోడ్డు పూర్తిగా కొట్టుకుపోయింది. రేగొండ మండలంలో గత రెండురోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు రేగొండ మండలం లో పొంగి పొర్లుతున్న వాగులు పూర్తిగా నిండిన చెరువులు కుంటలు .. మండలంలోని రూపిరెడ్డి పల్లి గ్రామంలో ఇళ్ళలోకి చేరిన వరద నీరు పూర్తిగా తడిసి ముద్దైన బియ్యం బస్తాలు .. తడిసిన వంట సామగ్రి చదవడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
అధికారులు అప్రమత్తంగా ఉండాలి : ఎమ్మెల్యే
మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో ప్రజల కు ఎలాంటి నష్టం వాటిల్లకుండా అధికారులు అప్రమ త్తంగా ఉండాలని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. జిల్లాలోని అన్ని శాఖల అధికారులు క్షేత్ర స్థాయిలో గ్రామాల్లో పర్యటించాలని రోడ్ల మీద నీరు నిల్వకుండా చర్యలు చేపట్టాలని సూచించారు.
అందుబాటులో ఉండి ఆదుకుంటాం
మున్సిపల్ చైర్మన్ వెంకట రాణి
మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు పట్టణ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని అయినప్పటికీ ఎవరికైనా ఇబ్బందులు తలెత్తే సమయంలో సమాచారం అందిస్తే అందుబాటులో ఉండి ఆదుకుంటామని మున్సిపల్ చైర్మన్ వెంకటరాణి సిద్దు అన్నారు. మంగళవారం భూపాలపల్లి పట్టణంలోని 20,21,22 లక్ష్మీ నగర్, శాంతినగర్, హనుమాన్ నగర్ మూడు వార్డుల్లో వైస్ చైర్మన్ కొత్త హరి బాబు మున్సిపల్ కమిషనర్ బిల్ల శ్రీనివాస్ లతో కలిసి పర్యటించారు. సహాయం కొరకు 8978180036 సంప్రదించాలని కోరారు.
బొగ్గు ఉత్పత్తికి అంతరాయం
మల్హర్రావు : మండల కేంద్రమైన తాడిచెర్లతో పాటు ఆయా గ్రామాల్లో భారీ వర్షాలకు కాపురం బ్లాక్-1 ఓసిపిలో నీరు నిలిచి 16000 టన్నుల బొగ్గు ఉత్పత్తికి, 2,20,000 క్యూబిక్ మీటర్ల ఓబీ పనులకు అంతరాయం కలిగినట్లుగా ఆపరేషన్ హెడ్ చంద్ర మొగిలి, మైన్ మేనేజర్ కేఎస్ఎన్ మూర్తిలు తెలిపారు. మండలంలో చిన్న తరహా ప్రాజెక్టులైన కాపురం చెరువు, ఎడ్లపల్లిలోని బొగ్గులవాగు ప్రాజెక్టుల మత్తళ్ళు దూకాయి. మండల వ్యాప్తంగా వరి, పత్తి పంటలు నీట మునిగాయి. మానేరు, తీగల వాగులు ఉధృతంగా ప్రవహించాయి. పాక్షికంగా ఇంటి గోడలు కూలినవి. మానేరు పరివాహక ప్రాంతాల్లో ఉన్న పశువుల కాపర్లు, మత్స్యకారులు, రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తహశీల్దార్ శ్రీనివాస్, కొయ్యుర్ ఎస్సై సత్యనారాయణ హెచ్చరించారు.
మొగుళ్ళపల్లి : మండలంలో వరి పొలాలు నీటమునిగి రైతాంగానికి తీవ్ర నష్టం వాటిల్లింది. ఈ విషయమై ఏఓ సురేందర్‌రెడ్డిని వివరణ కోరగా వాగొడ్డు సమీపంలో సుమారు ఎనిమిది వందల ఎకరాల వరి పొలాలు నీట మునిగినట్లు తెలిపారు. కొన్ని గ్రామాల్లో రోడ్డు కోతకు గురై రాకపోకలకు అంతరాయం కలిగింది. లోలేవల్ బ్రిడ్జిపై చిన్న వాగు ప్రవహంతో రవాణా వ్యవస్థ స్తంభించింది. పెద్దవాగు, చిన్నవాగులు ఉధృతంగా ప్రవహించి తీవ్రస్థాయిలో పంట పొలాలకు నష్టం వాటిల్లడంతో రైతులు ఆందోళనకు గురయ్యారు.
మత్తడి పడుతున్న గణపసముద్రం చెరువు
గణపురం : మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు గణపసముద్రం చెరువు మంగళవారం ఉదయం నుంచి మత్తడి పడుతుంది. గణపసముద్రం చెరువు మత్తడి 30 ఫీట్ల ఎత్తు ఉండగా మూడు ఫీట్ల ఎత్తులో మత్తడి పడడం విశేషం. గణపసముద్రం చెరువు కింద ఐదు వేల ఎకరాలు పంటలు సాగు అవుతుండగా అనధికారికంగా మరో 5 వేల ఎకరాలు సాగవుతున్నాయి. గణపసముద్రం చెరువు మత్తడి పడితే మూడు పంటలకు డోకా లేదు. కాగా గత మూడు సంవత్సరాలుగా మత్తడి ప్రతి సంవత్సరం పడుతూ రైతులను ఆనందోత్సవంలో ముంచేస్తుంది.
నీట మునిగిన వరి పంటలు
గణపసముద్రం చెరువు మత్తడి పడుతుండడంతో పంట పొలాలు నీట మునిగాయి. దాదాపు ఐదు వందల ఎకరాల వరి పంట నీట మునగడంతో రైతులు కన్నీళ్ల పర్యాంతం అవుతున్నారు. అంతేకాక గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షంతో పత్తి పంటలు నేలకొరిగే రైతులు నాట్లు వేసుకున్న వారం రోజుల్లోనే పడుతుండడంతో రైతులు వేసిన వరి పంట కొట్టుకుపోయింది
ఉప్పొంగిన మోరంచవాగు
మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో వాగులు ఉప్పొంగడంతో రాకపోకలు నిలిచిపోయాయి. మండలంలోని వెళ్తుర్ల పలి,్ల అప్పనపల్లి మధ్యలో ఉన్న బోరంచవాగు భారీగా ఉప్పొంగింది.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్సై ఉదరుకిరణ్ పేర్కొన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని గణపసముద్రం చెఱువు మోరాంచ వాగు గణపసముద్రం చెరువు నీరు చెంచుకాలనీ వాసుల ఇండ్లలోకి నీరు చేరడంతో ఆ కాలనీ వాసులతో మాట్లాడారు. కాలనీ వాసులు అప్రమత్తంగా ఉండాల న్నారు. ప్రజలు పోలీసులకు సహకరించాలన్నారు.
మోరంచ వాగును ఆర్డీఓ పరిశీలన
మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు ఉప్పొంగడంతో మంగళవారం భూపాలపల్లి ఆర్డీవో శ్రీనివాస్ పరిశీలించారు. గణపసముద్రం చెరువు మత్తడి పడుతుండగా దానిని పరిశీలించి దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. నీట మునిగిన ఇండ్ల ప్రజలను వేరే చోటకు తరలించాలని తహసిల్దార్ కష్ణ చైతన్యను ఆదేశించారు.
పలిమెల : మండలంలోని లెంకలగడ్డ, పంకెన, సర్వాయిపేట, మోదేడు వాగులు పొంగిపోర్లుతు న్నాయి. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు పోటెత్తాయి. ఇదిలా ఉండగా కమాన్‌పల్లి గ్రామము నుంచి ముఖునూర్ వెళ్లె రహాదారి మార్గంలో దట్టమైన అడవి ప్రాంతంలో రహాదారి మొత్తం తెగి పోయింది. మేడిగడ్డ భ్యారేజి గేట్లు ఎత్తడంతో భారీగా నీరు చేరి వాగులు పోటెత్తాయి. పంటలు నీటిలో మునిగి రైతులకు నష్టం వాటిల్లుతున్నది. గోదావరి పరివాహక ప్రాంత పత్తి, మిర్చి చేనులు మునిగిపోయాయి.
మహాముత్తారం : ఎడతెరిపి లేకుండా కురుస్తున్నా భారీ వర్షాలకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్సై సీహెచ్ శ్రీనివాస్ అన్నారు. మండలంలోని పెగడపల్లి, కేశవాపూర్, పెద్దవాగు, ముత్తారం అలుగువాగు ఉదతంగా ప్రవహిస్తున్నాయి. వాగులు దాటే సాహసం చేయరాదని ఆయన అన్నారు.
ఇండ్లలోకి చేరిన వర్షపు నీరు
చిట్యాల : మండలంలో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. పలు గ్రామాలలోకి వర్షపు నీరు చేరి గ్రామస్తులను రాత్రి కంటి మీద కునుకు లేకుండా చేశాయి. నీటి ఉధతితో కల్వర్టులు, మోరీలను దాటేందుకు ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చలివాగు, మొరంచ, మానేరు వాగులు పొంగి పొరలడంతో పరివాహక ప్రాంతాల్లో ఉన్న వేల ఎకరాల పంట పొలాలు నీట మునిగాయి. బావుసింగ్‌పల్లి ఎస్సీ కాలనీలో, నవాబుపేట ఎస్సీ కాలనీలలో, వెంచరామి, గోపాలపురం, గాంధీనగర్, కాలనీలు వర్షంతో తడిసి ముద్దయ్యాయి. ఎస్ఎం కొత్తపల్లి వద్ద కల్వర్టు వద్ద ఎస్సై వీరభద్రరావు తన సిబ్బందితో సహాయక చర్యలు చేపట్టారు. మండలం లో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని తహసిల్దార్ రామారావు తెలిపారు.
బొగ్గు ఉత్పత్తికి విఘాతం
కోల్‌బెల్ట్ : భూపాలపల్లి ఏరియాలోని కాకతీయఖని ఓసి 2, 3 గనులలో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో బొగ్గు ఉత్పత్తికి విఘాతం కలిగింది. సోమవారం, మంగళవారం కురిసిన వర్షం కారణంగా గనులలోకి నీరు చేరడం వల్ల ఉత్పత్తి స్తంభించింది. రోజుకి ఓసి గని ఉత్పత్తి లక్ష్యం 3,077 టన్నులు కాగా సోమవారం ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది.