Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కాజీపేట
నాణ్యత ప్రమాణాలు పాటించకుండా నాసి రకంగా పనులు చేస్తు ప్రజాధనాన్ని దుర్వి నియోగం చేస్తూ స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులు ప్రజలను మోసం చేస్తున్నారని గ్రేటర్ వరంగల్ 47 వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ కాంటెస్ట్ అభ్యర్థి సందెల విజరు కుమార్ అన్నారు. వరంగల్ హైదరాబాద్ ప్రధాన రహదారికి ఆనుకుని ఉన్న 47 వ డివిజన్ పరిధిలో డీజిల్ కాలనీ సమీపంలో రహదారిపై నిర్మించిన నూతన కల్వర్టును లోతట్టు ప్రాంతాలను కాంగ్రెస్ నాయకులతో కలిసి విజరు కుమార్ సందర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రధాన రహదారిపై వర్షపు నీరు నిలిచి డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేక వాహన దారులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. డ్రైనేజి ఏర్పాటు చేయాలని గతంలో ధర్నాలు రాస్తా రోకోలు నిర్వహించగా అధికారులు ప్రజా ప్రతి నిధులు స్పందించి డ్రైనేజీ పనులను ప్రారంభిం చారన్నారు. నాణ్యత ప్రమాణాలు పాటించకుండా నాసిరకం పనులు చేపట్టడంతో డ్రైనేజీ నీటి ప్రవాహానికి దెబ్బతిందని అన్నారు. కల్వర్టును నిర్మించి రోడ్డు వేయాలని ఇండ్ల్లలోకి నీరు నిలువకుండా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. నాయకులు రావుల సాగర్, ఇమ్మడి బాబు, దొంగల కుమార్, నాగేష్, విలియమ్స్ మానస, శాంతి, ప్రియ తదితరులు పాల్గొన్నారు.