Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మహాదేవపూర్
మంథని నియోజకవర్గంలో ప్రతి ఎకరానికి నీళ్లు అందించడానికి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ నిర్మిచాలని పెద్దపల్లి జెడ్పీ చైర్మెన్, మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ కోరారు. మంగళవారం హైదరాబాద్ మెట్రో భవన్లో ముఖ్యమంత్రి కార్యాలయం కార్యదర్శి స్మితా సబర్వాల్‌ను ఆయన కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పోతారం లిఫ్ట్ ఇరిగేషన్ రూ.210 కోట్లతో నిర్మించి చివరి ఆయకట్టు మంథని, రామగిరి మండలంలోని 30,000 ఎకరాలకు నీళ్లు అందించాలన్నారు. చిన్న కాళేశ్వరం ప్రాజెక్ట్ ను త్వరగా పూర్తిచేసి కాటారం, మహాదేవపూర్, మల్హర్, మహముత్తారం మండలాల్లోని 45వేలఎకరాల కు నీళ్లు అందిం చాలని అన్నారు. దామేరకుంట లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు రూ.30కోట్లతో నిర్మించి దామేరకుంట గ్రామంలోని 2200 ఎకరాలకు నీళ్లు అందించా లన్నారు. మల్హర్ మండలంలో రూ.30 కోట్లతో విలసాగర్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు నిర్మించి విలసాగర్, గంగారాం గ్రామాల్లోని 1000 ఎకరాలకు నీరందించాలన్నారు. మల్హర్ మండలం లో రూ.90 కోట్లతో మల్హర్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ నిర్మించి మల్హర్ మండలం లోని మల్లారం, పెద్దతుండ్ల, దుబ్బఘాట్, దుబ్బపేట, కాపురం, తాడిచెర్ల గ్రామాల్లోని 7000 ఎకరాలకు నీళ్లు అందించాలని కోరారు. మంథని మండలం లో రూ.120 కోట్లతో ఆరెంద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు నిర్మించి ఆరెంద, మల్లారం, భట్టుపల్లి, వెంకటా పూర్, నాగేపల్లి, ఆడివిసోమన్ పల్లి, స్వర్ణపల్లి గ్రామాల్లో 7500 ఎకరాలకు నీరందించాలని అన్నారు. ఆయనవెంట నాయకులు జక్కు రాకేష్, దాసరి రాజలింగు పాల్గొన్నారు.