Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు చక్రపాణి
నవతెలంగాణ-రేగొండ
మూడు రోజుల కురుస్తున్న వర్షాలతో పంట నష్టపోయిన రైతులను ఇల్లు కూలిపోయిన ప్రజలను ప్రభుత్వం ఆదుకోవాలని సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సబ్యులు చక్రపాణి కోరారు. మంగళవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో డీటీ విఠలేశ్వర్కు పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. అనంతరం చక్రపాణి మాట్లాడుతూ చిన్నకోడెపాకతో పాటు అనేక గ్రామాల్లో వర్షాల మూలంగా పంటలు నీటిలో మునిగి పోయాయని అలాగే అనేక గ్రామాల్లో ఇళ్లు కూలిపోయి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. పంట నష్టం వాటిల్లినా వాటిని సర్వే చేెసి నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. ఇల్లు కూలిపోయిన ప్రజలకు ఆర్థిక సహాయం అందించి ఆదుకోవాలని కోరారు. పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని పోడు భూములు దున్ను కోడానికి ట్రాక్టర్లు అనుమతివ్వాలని కోరారు. ఫారెస్ట్ అధికారులు స్వాధీనం చేసుకున్న భూములను తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వాలన్నారు. దళితులకు మూడె కరాల భూమి ఇవ్వాలని డిమాండ్ చేశారు. తదితర సమస్యలు ప్రభుత్వం పరిష్కరించకపోతే రాబోయే రోజుల్లో పోరాటాలు నిర్వహిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. జిల్లా నాయకులు గుర్రం దేవేందర్, గొర్రెల మేకల పెంపకందార్ల సంఘం జిల్లా అధ్యక్షులు చేపూరి ఓదేలు, వైనాల నరేష్, బొట్ల రమేష్, మైనర్బాబు, గజ్జి సదానందం తదితరులు పాల్గొన్నారు.