Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నర్సంపేట
విద్యార్థులు కరోనా బారిన పడకుండా అధికారులు నిరంతరం ప్రయివేటు విద్యా సంస్థలను పర్యవేక్షించి తగు చర్యలు చేపట్టాలని ఎస్ఎఫ్ఐ వరంగల్ జిల్లా అధ్యక్షులు యార ప్రశాంత్ డిమాండ్ చేశారు. మంగళవారం పట్టణంలోని పలు విద్యా సంస్థలను ఎస్ఎఫ్ఐ బృందం సందర్శించి. కోవిడ్ నిబంధనల అమలు తీరుతెన్నులను పరిశీలించారు. అనంతరం కార్యాలయంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యులు రాకేష్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ప్రశాంత్ మాట్లాడారు. పాఠ శాలలను, కళాశాలలు తెరిచేందుకు అనుమతినిచ్చి పర్యవేక్షించక పోవడం సరికాదన్నారు. ప్రయివేటు యాజమాన్యాలు కోవిడ్ నిబంధనలను సక్రమంగా పాటించకుండా బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నాయని అన్నారు. విద్యార్థుల నుండి ఫీజులు వసూళ్లు చేసేందుకే యత్నిస్తున్నా యని అన్నారు. విద్యా సంస్థల్లో కరోనా ఎవరికొచ్చిన వెంటనే వైద్యాధి కారులకు సమాచారం ఇచ్చి అదే పాఠశాలలో విద్యార్థులకు, ఉపాధ్యాయులకు, ఇతర సిబ్బందికిి కోవిడ్ నిర్థారణ పరీక్షలు చేయాలని అన్నారు. ప్రత్యేక ఐసోలేషన్ ఏర్పాటు చేసి వైద్యం అందించాలని డిమాండ్ చేశారు.లేదంటే ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఎస్ఎఫ్ఐ నాయకులు శివ, సుశాంత్, సుమన్, దాసరి శ్రీకాంత్, ప్రశాంత్, హరీష్, కష్ణ, శ్రీహరి, తదితరులు పాల్గొన్నారు.