Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-వరంగల్ ప్రాంతీయ ప్రతినిధి
సీఎం కేసీఆర్ కృషి వల్లే గ్రామ పంచాయతీల ప్రగతి, ఆడిటింగ్‌లో మన రాష్ట్రమే నెంబర్ వన్‌గా నిలిచిందని రాష్ట్ర పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలిపారు. పంచాయతీలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న నిధుల వినియోగం, ఖర్చుల విషయంలో ఆన్లైన్ ఆడిటింగ్‌లో మరోమారు తెలంగాణ రాష్ట్రం మొదటిస్థానంలో నిలవడం పట్ల మంత్రి హర్షం వ్యక్తం చేశారు. కేంద్రం 15వ ఆర్ధిక ంఘం నిధులకు సమానంగా నిధులు ఇస్తున్న రాష్ట్రం ఒక్క తెలంగాణ మాత్రమేనన్నారు. ఈ ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందన్నారు. అన్ని పంచాయతీలను ఆడిటింగ్ చేయాలని కేంద్ర ప్రభుత్వం గత ఏడాది నిర్ణయించిందని, ఆ ఏడాది 25 శాతం ఆడిటింగ్ జరిగినా చాలని కేంద్రం భావించిందన్నారు. తెలంగాణలో మాత్రం 40 శాతం ఆడిటింగ్‌ను అధికారులు పూర్తి చేశారన్నారు. దీంతో ఇతర రాష్ట్రాల అధికారులు మన రాష్ట్రానికి వచ్చి ఆన్లైన్ ఆడిటింగ్‌ను అధ్యయనం చేసి వెళ్లా రని చెప్పారు. కరోనా నేప థ్యంలోనూ ఈ ఏడాది జూన్ లోనే ఆడిటింగ్‌ను మొదలుపెట్టి కేవలం మూడు నెలల్లోనే 28 శాతం ఆడిటింగ్ పూర్తి చేసి మరోమారు దేశంలో అగ్రస్థానంలో నిలిచామని తెలిపారు. రాష్ట్రంలోని పలు తండాలను గ్రామ పంచాయతీలుగా ఉన్నతీకరించిన ఘనత సీఎం కేసీఆర్‌దేనన్నారు. రాష్ట్రంలో స్థానిక పరిపాలన అద్భుతంగా కొనసాగుతుందన్నారు. పల్లె ప్రగతి సాధించిన ఫలితాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయన్నారు. ఇదే క్రమంలో నిర్వహిస్తున్న ఆడిటింగ్‌లో మన రాష్ట్రంలో దేశంలోనే అగ్రస్థానంలో నిలవడం పట్ల సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.