Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కాంగ్రెస్ జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు సుధాకర్
నవతెలంగాణ-గోవిందరావుపేట
అర్హులైన దళిత గిరిజనులందరికీ దళిత, గిరిజన బంధు సాయం ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ అనుబంధ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు దాసరి సుధాకర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మండలంలోని కోటగడ్డ, లక్ష్మీపురం, పాపయ్యపల్లి గ్రామాల్లో పార్టీ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ సీతారాం నాయక్ ఆధ్వర్యంలో ఆదివారం దళిత గిరిజన ఆత్మగౌరవ దండోరా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సుధాకర్ హాజరై మాట్లాడారు. దళిత గిరిజనులకు సీఎం కేసీఆర్ చేసిన మోసాలను వివరిస్తున్నట్టు తెలిపారు. హుజురాబాద్ ఉప ఎన్నికలో గెలుపు కోసమే సీఎం కేసీఆర్ దళితబంధు పథకాన్ని తీసుకొచ్చారని ఆరోపించారు. సీఎం కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే దళితుడిని సీఎం చేస్తానని, మూడెకరాలు చొప్పున భూపంపిణీ, తదితర అన్ని హామీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రజలు సీఎం కేసీఆర్ మోసాలను అర్ధం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా నాయకుడు కణతల నాగేందర్రావు, కొంపెల్లి శ్రీనివాస్‌రెడ్డి, పాలడుగు వెంకటకృష్ణ, సూదిరెడ్డి జన్ధాన్రెడ్డి, జెట్టి సోమయ్య, ఎంపీటీసీలు గోపిదాసు ఏడుకొండలు, గుండెబోయిన నాగలక్షి అనిల్ యాదవ్, చాపల ఉమాదేవి, సూడి సత్తిరెడ్డి, కట్ల జనార్ధన్‌రెడ్డి, గ్రామ కమిటీ అధ్యక్షుడు మట్ట పాపిరెడ్డి, సాంబశివరావు, పోతరాజు రమేష్, ఏనుగు శేఖర్, బైరి కొండల్‌రెడ్డి, పాల్వాయి సుజాత, పాల్వాయి ఐలమ్మ, పాల్వాయి స్వరూప, పాల్వాయి రమ, పాల్వాయి మల్లమ్మ, పడిశాల లలిత, పోతరాజు పూలమ్మ, నక్క దర్శనం, చెన్నమల్ల లక్ష్మీ, బానోత్ సమ్మయ్య, ఇస్లావత్ లచ్చిరామ్, ధారావత్ లక్ష్మణ్, భూక్య సీతారాం, ఇస్లావత్ రాజు, బానోత్ రాజయ్య, ఇస్లావత్ రజిత, ధారావత్ విజయ, ఇస్లావత్ పుష్పాలత, అజ్మీర బిందు, బానోత్ సమ్మక్క, గాంధర్ల బాబు, తండా కష్ణ, వాసం వెంకటేశ్వర్లు, గాంధర్ల వేణు, ఎట్టి సమ్మయ్య, జాడి చిన్న సమ్మయ్య, జాడి లక్ష్మయ్య, జాడి బొంధాలు, జిమ్మిడి సోమేశ్, జిమ్మిడి నర్సయ్య, జిమ్మిడి వెంకన్న, దుర్గం నారాయణ, జీడీ వెంకన్న, జీడీ రవి, జీడీ రమేష్ తదితరులు పాల్గొన్నారు.