Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పార్టీ మండల అధ్యక్షుడు చిటమట రఘు
నవతెలంగాణ-ఏటూరునాగారం
కాంగ్రెస్ బలోపేతానికి కృషి చేయాలని ఆ పార్టీ మండల అధ్యక్షుడు చిటమట రఘు కోరారు. మండలంలోని చిన్నబోయినపల్లి గ్రామంలో శనివారం దళిత, గిరిజన దండోరా యాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశానికి చేల నవీన్ అధ్యక్షత వహించగా రఘు మాట్లాడారు. పార్టీకి కార్యకర్తలే పునాదులని చెప్పారు. చిన్న బోయినపల్లి, వెంకటాపురం, రాయబంధం, చింతలమోరి గ్రామాల్లో పోడుభూముల సమస్య ఎక్కువగా ఉందన్నారు. కాంగ్రెస్ పాలనలోనే గిరిజనులకు పోడుభూములకు పట్టా లిచ్చినట్టు తెలిపారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక గిరి జనుల నుంచి భూములను లాక్కుటోందని విమర్శించారు. పోడుభూముల సమస్య పరిష్కారం కోసం త్వరలో చిన్నబోయినపల్లి నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు పాదయాత్ర చేపడతామని తెలిపారు. దళితులకు, గిరిజ నులకు దళితబంధు తరహాలో రూ.10 లక్షలు చొప్పున సాయం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనంతరం గ్రామ కమిటీని ఎన్నుకున్నారు. చిన్నబోయిన పల్లి కమిటీ అధ్యక్షుడిగా కంభం రాజేష్, వర్కింగ్ కమిటీ అధ్యక్షుడిగా లాల్ మొహమ్మద్, ప్రధాన కార్యదర్శిగా సిద్దబోయిన ప్రసాద్, ఉపాధ్యక్షుడుగా తిప్పనబోయిన శేఖర్, కార్యదర్శిగా కిషోర్, పుల్లల వెంకట్రెడ్డి, రమేష్, నర్సయ్య, సోడి రామయ్య, శీలం శ్రీను, దూడ సోమయ్య, కలం దేవ రాజు, సారయ్య, సారయ్య గౌడ్ తదితరులను ఎన్ను కున్నారు,. అలాగే కిసాన్ సెల్ గ్రామ కమిటీ అధ్యక్షుడలుగా గంట నారాయణరెడ్డి, ఇడకాపురం సత్యనారాయణ, దూడ సోమయ్య, వెంకన్న, మల్లికార్జున్, సురేష్, చిరంజీవి, మౌలానా, కన్నయ్య, బండి మిడియం తదితరులను ఎన్ను కున్నారు. కమిటీ ఆధ్వర్యంలో ఇంటింటి సర్వే నిర్వహించా లని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు ఖలీల్ ఖాన్, జిల్లా ప్రధాన కార్యదర్శి గౌస్, మండల ప్రధాన కార్యదర్శి వావిలాల ఎల్లయ్య, మండల ప్రచార కార్యదర్శి బాసాని విద్యాసాగర్, సహాయ కార్యదర్శి తూర్పాటి కుమారస్వామి, యూత్ అధ్యక్షుడు వసంత శ్రీనివాస్, కిసాన్ సెల్ మండల అధ్యక్షుడు, గడ్డం శ్రీధర్, సొసైటీ డైరెక్టర్ రవిమోహన్రెడ్డి, నీలం శ్రీను, పత్తి సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.-