Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కొనసాగుతున్న బిల్ట్ కార్మికుల పాదయాత్ర
నవతెలంగాణ-గోవిందరావుపేట
బిల్ట్ కార్మికులకు 72 నెలలుగా వేతనాలు అందడం లేదు. అలాగే 64 నెలలుగా పీఎఫ్ బకాయిలు సైతం చెల్లించడం లేదు. ఈ క్రమంలో సమస్యల పరిష్కారం కోసం బిల్ట్ కార్మికులు కమలాపురంలో బిల్ట్ ఫ్యాక్టరీ నుంచి హైదరాబాద్‌లోని ప్రగతి భవన్ వరకు తలపెట్టిన పాదయాత్ర కొనసాగుతోంది. పాదయాత్ర ఆదివారం పస్రా గ్రామానికి చేరుకుంది. ఈ సందర్భంగా కార్మికులు మాట్లాడారు. 72 నెలలుగా వేతనాలు లేక అర్ధాకలితో అలమటిస్తున్నామని చెప్పారు. పెండింగ్ వేతనాలతోపాటు పీఎఫ్ బకాయిలు చెల్లించాలని, పరిశ్రమను తెరిపించాలని, ఇతర సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని, యాజమాన్యాన్ని పలుమార్లు కోరినా పట్టించుకోవడం లేదని వాపోయారు. యాజమాన్య, ప్రభుత్వ మోసపూరిత విధానాల వల్ల ఇప్పటికే చాలా మంది కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారని ఆందోళన వెలిబుచ్చారు. ఇప్పటికైనా ప్రభుత్వం, బిల్ట్ యాజమాన్యం స్పందించి సమస్యలు పరిష్కరించాలని కోరారు. పాదయాత్రకు వైఎస్సార్ టీపీ నాయకుడు దేవానాయక్, బీజేపీ నాయకుడు వెంకట్, కాంగ్రెస్ నాయకుడు సీతారాంనాయక్, జంపాల ప్రభాకర్, తదితరులు సంఘీభావం తెలిపారు.
బిల్ట్ పరిశ్రమను ప్రారంభించాలి : కాంగ్రెస్
బిల్ట్ పరిశ్రమను ప్రారంభించాలని, కార్మికుల వేతన బకాయిలు చెల్లించడంతోపాటు ఇతర సమస్యలు పరిష్కరించాలని కాంగ్రెస్ పార్టీ మండల నాయకుడు కణతల నాగేందర్రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బిట్ కార్మికుల పాదయాత్రకు మండల కేంద్రానికి చేరుకోగా ఆయన ఆధ్వర్యంలో నాయకులు సంఘీభావం తెలిపికార్మికులకు పండ్లు, తాగునీరు అందించారు. అనంతరం నాగేందర్రావు మాట్లాడారు. స్వరాష్ట్రం ఏర్పడితే ఉద్యోగాలు వస్తాయని ఆశించగా ఉన్న ఉద్యోగాలు పోతున్నాయని ఆందోళన వెలిబుచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి బిల్ట్‌ను తెరిపించి ఇతర సమస్యలను పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో కాంగ్రెస్ అనుబంధ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు దాసరి సుధాకర్, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ రసపుత్ సీతారాంనాయక్, కొంపెల్లి శ్రీనివాస్‌రెడ్డి, పాలడుగు వెంకటకష్ణ, సూదిరెడ్డి జనార్ధన్‌రెడ్డి, కట్ల జనార్ధన్‌రెడ్డి, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు చింత క్రాంతి, ఎంపీటీసీ గోపిదాసు ఏడుకొండలు, జెట్టి సోమయ్య, రామచంద్రపు వెంకటేశ్వర్రావు, మద్దినేని వినరు, సాయిలు, రేగుల అరవింద్ తదితరులు పాల్గొన్నారు.