Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు మూర్తి
నవతెలంగాణ-జనగామ
హైదరాబాద్ సింగరేణికాలనీలో ఆరేండ్ల బాలికపై హత్యాచార ఘటనలో నిందితుడిని కఠినంగా శిక్షించాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎల్ మూర్తి డిమాండ్ చేశారు. ఆదివారం స్థానిక ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు ధర్మబిక్షం అధ్యక్షతన ఏర్పాటు చేసిన జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గని మాట్లాడారు. దేశంలో మహిళలకు రక్షణ కరువైందని, వారికి రక్షణ కల్పించడంలో పాలకులు విఫలమయ్యారని అన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం మనోధైర్యమిచ్చి ఆదుకోవాలన్నారు. ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి బడ నరేందర్, జిల్లా ఉపాధ్యక్షుడు దడిగె సందీప్, నాయకులు తరుణ్, శ్రీకాంత్, కార్తిక్, చందు, తదితరులు పాల్గన్నారు.
రేగొండ : హైదరాబాద్ సింగరేణి కాలనీలో ఆరేండ్ల బాలికపై హత్యాచార ఘటనలో నిందితుడిని ఉరితీయాలని కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి గుర్రం దేవేందర్ డిమాండ్ చేశారు. ఆదివారం మండల కేంద్రంలో బట్ల కుమార్ అధ్యక్షతన నిర్వహించిన కేవీపీఎస్ ముఖ్యకార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో దళిత గిరిజన మహిళలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. రోజురోజుకు దళిత గిరిజనులపై దాడులు దౌర్జన్యాలు, హత్యాచారాలు పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. నిర్భయ చట్టాలు ఎన్ని వచ్చినా వాటిని పకడ్బంధీగా అమలు చేయకపోవడంతో ఇలాంటి ఘోరాలు జరుగుతూనే ఉన్నాయన్నారు. ప్రభుత్వం స్పందించక పోవడం సిగ్గుచేటన్నారు. నిందితుడిని ఉరితీయ కుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరిం చారు. దుడ్డే రాములు, సుమన్, రవికుమార్, ప్రేమ్‌చంద్, రాజు పాల్గొన్నారు.
జఫర్గడ్ : హైదరాబాద్ సింగరేణి కాలనిలో అరేండ్ల గిరిజన బాలికపై హత్యాచార ఘటనలో నిందితుడిని ఉరితీయాలని గిరిజన సంఘం జిల్లా అధ్యక్షుడు రమేష్ డిమాండ్ చేశారు. ఆదివారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సంఘం సమావేశంలో ఆయన మాట్లాడారు. ఘటన జరిగి రెండు రోజులు కావస్తున్నా నిందితున్ని పట్టుకొని శిక్షించడంలో రాష్ట్ర ప్రభుత్వం పోలీసు యంత్రాంగం విఫలమైందని అన్నారు. రెండు నెలల కిందట నకిరేకల్‌లో ఓ బాలిక పై హత్యాచార ఘటనపై కూడా పట్టనట్లు వ్యవహరించడం సిగ్గు చేటన్నారు. నిర్భయ, దిశ చట్టాల ద్వారా నిందితున్ని ఉరితీ యాలని డిమాండ్ చేశారు. లేదంటే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడుతామని హెచ్చరించారు. భూక్య బాలజీనాయక్, నల్లతిగల శ్రీనివాస్, బానోత్ భిక్షపతి, బాబినాయక్, భూక్య లాలూనాయక్, రవీందర్ నాయక్, బాబునాయక్, యాకుబ్, మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.