Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తొర్రూర్ టౌన్
ఒంటరి మహిళలకు, సీనియర్ సిటిజన్లకు పోలీసు శాఖ అండగా ఉంటుందని తొర్రూర్ ఎస్సై సతీష్ తెలిపారు. మండలంలోని ఫత్తేపురం గ్రామంలో రోడ్డు ప్రమాదాలు, ఆత్మహతల నివారణ, సైబర్ నేరాలపై ఆదివారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడారు. లైసెన్స్ లేకుండా వాహనాలు నడపొద్దని స్పష్టం చేశారు. ద్విచక్ర వాహనదార్లు హెల్మెట్ ధరించాలని, ట్రాఫిక్ రూల్స్ పాటించాలని కోరారు. ఏ సమస్యలన్నా ఆత్మహత్యలకు పాల్పడొద్దని చెప్పారు. సమస్యలున్న వ్యక్తులు డయల్ 100కు ఫోన్ చేస్తే కౌన్సిలింగ్ ఇస్తామన్నారు. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగాఉండాలని సూచించారు. అనంతరం గ్రామంలోనినలుగురు వద్ధుల ఇండ్లకు వెళ్లి పండ్లు, ఆర్థికసాయం అందించారు. కార్యక్రమంలో సర్పంచ్ గూడెల్లి సోమనర్సమ్మ వెంకన్న, వైస్ ఎంపీపీ శ్యాంసుందర్‌రెడ్డి, సిబ్బంది రమేష్, సాయికష్ణ, తదితరులు పాల్గొన్నారు.