Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు తమ్మెర విశ్వేశ్వర్రావు
నవతెలంగాణ-తొర్రూరు
తెలంగాణ సాయుధ పోరాట 74వ వార్షికోత్సవ సందర్భంగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి నాయకత్వంలో ఈనెల 13న తొర్రూరు పట్టణానికి చేరుకోనున్న జాతాను జయప్రదం చేయాలని సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు తమ్మెర విశ్వేశ్వర్రావు కోరారు. జాతాకు సంబంధించిన వాల్పోస్టర్ను ఆదివారం ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. జాతా తొర్రూరు నుంచి అమ్మాపురం గ్రామానికి చేరుకుని అక్కడ తెలంగాణ సాయుధ పోరాట అమరవీరుల స్తూపానికి నివాళ్లర్పించి పోరాట కుటుంబాలను సన్మానిస్తుందని తెలిపారు. రజాకార్లను తెలంగాణ నుంచి తరిమి హైదరాబాద్ ప్రభుత్వాన్ని యూనియన్ గవర్నమెంట్లో విలీనం చేసి 74 ఏడ్లు గడచినా తెలంగాణలో తాగు, సాగునీటితోపాటు విద్య, వైద్యం, ఇతర సమస్యలు అపరిష్కృతంగానే ఉన్నాయని చెప్పారు. స్వరాష్ట్రాన్ని సాధించుకుని ఏడేండ్లు గడచినా ప్రభుత్వం చేసిందేమీ లేదన్నారు. అధికారాన్ని నిలుపుకోవడానికి ప్రజలకు తాయిలాలు ప్రకటిస్తూ స్వతంత్రంగా జీవించే విధానాన్ని అమలు చేయకుండా మోసపూరిత విధానాలు అవలంభిస్తోందని చెప్పారు. ఈనెల 17న హైదరాబాద్లో జాతా ముగింపు ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు ఓమ భిక్షపతి, సీపీఐ మండల కార్యదర్శి గట్టు శ్రీమన్నారాయణ, వ్యకాస జిల్లా నాయకులు గణపురం లక్ష్మణ్, సీపీఐ సీనియర్ నాయకులు సైరారెడ్డి, నర్సింహారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.