Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-లింగాలఘనపురం
మండల పరిధి కళ్లెం-జీడికల్ ప్రధాన రోడ్డు ప్రమాదకరంగా మారింది. 2014లో బీటీ రోడ్డు రెండవ లేయర్ వేసి పూర్తి చేశారు. ఇప్పటి వరకు ఎలాంటి మరమ్మతులు చేపట్టలేదు. కళ్లెం, సిరిపురం చెరువు ,కుంటలు మత్తడి పడడంతో వరద ఉధృతికి రోడ్డు కోతకు గురైంది. దీంతో జనగామ, కళ్లెం, సిరిపురం, జీడికల్ గుండా వెళ్లే వాహనదారులు, బాటసారులు ఇబ్బందులు పడుతున్నారు. కళ్లెం కమాన్ నుంచి జీడికల్ గ్రామం వరకు రోడ్డు అంతా గుంతలమయమై సమస్యలు తలెత్తుతు న్నాయని, ఎలాంటి ప్రమాదం జరగక ముందే ఆర్అండ్ బీ అధికారులు స్పందించి రోడ్డుకు మరమ్మత్తు చేపట్టాలని వాహనదారులు, ప్రజలు కోరుతున్నారు.