Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఏసీపీ సీహెచ్ ఫణీంద్ర
నవతెలంగాణ పబ్లిషింగ్ హౌజ్ ఆధ్వర్యంలో పుస్తక ప్రదర్శన
నవతెలంగాణ-నర్సంపేట
బావి తరాలకు చక్కటి మార్గం చూపేది పుస్తకమేనని ఏసీపీ సీహెచ్ ఫణీంద్ర అన్నారు. నవతెలంగాణ పబ్లిషింగ్ హౌజ్ ఆధ్వర్యంలో వీర తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాల సందర్భంగా ఆదివారం పట్టణంలోని ఆర్అండ్బీ గెస్టు హౌజ్ ఎదుట నిర్వహించిన పుస్తక ప్రదర్శనను ఏసీపీ, కే.కరుణాసాగర్ రెడ్డి(ఎస్హెచ్వో)తో కలిసి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. చరిత్రను తెలుసుకోవడం వల్లనే రేపటి సమాజాన్ని మేల్కొల్పగలమన్నారు. విజ్ఞానవంతమైన శాస్త్రీయ ఆలోచనను రేకెత్తించడానికి సాహిత్యం దోహదపడనుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం, ఆన్లైన్ డిజిటలైజేషన్ ఎంతటి అభివృద్ధి చెందినా పుస్తక పఠనం తప్పనిసరిని పేర్కొన్నారు. ఈ దిశలో నవతెలంగాణ పబ్లిషర్స్ అందజేస్తున్న సాహిత్యం సమాజానికి ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. సమాజానికి చక్కటి సాహిత్యాన్ని అందజేయడంలో 'నవతెలంగాణ పబ్లిషర్స్' విశేష పాత్ర పోషిస్తుందని అభినందించారు. ఈ వారోత్సవాలలో పుస్తక ప్రదర్శన మరింత ఆదరణ చూరగొనాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై బీ.రామ్చరణ్, లీడ్ సంస్థ ఫౌండర్ కాసుల రవికుమార్, సీపీఐ(ఎం) జిల్లా నాయకులు ఈసంపెల్లి బాబు, భూక్య సమ్మయ్య, కొరబోయిన కుమారస్వామి, హన్మకొండ శ్రీధర్, సీఐటీయు నాయకురాలు గుజ్జుల ఉమా, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి యార ప్రశాంత్, బుక్ హౌజ్ మేనేజర్ బండారి బాబు పాల్గొన్నారు.