Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సమస్యలు పరిష్కరించాలని క్రీడాకారుల వేడుకోలు..
నవతెలంగాణ-పోచమ్మ మైదాన్
వరంగల్ మహానగర పాలక సంస్థ సమీపంలోని ఇండోర్ స్టేడియం సమస్యలు పరిష్కరించాలని క్రీడాకారులను ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరంగల్ జిల్లాలోని క్రీడాకారులను జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఆడిన ఘనత ఇండోర్ స్టేడియంకు ఉన్నప్పటికీ, మౌలిక సదుపాయాలు కల్పించకపోవడంతో క్రీడాకారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రతిరోజు వందల మంది క్రీడాకారులు స్టేడియానికి వచ్చి శిక్షణ పొందుతున్నారు. మ్యాటులు మంజూరైనాయని అధికారులు చెబుతున్నప్పటికీ ఇంతవరకు వాటి .జాడే కనిపించడం లేదు. ఎగ్జాస్ట్ ఫ్యాన్స్ పనిచేయక ఆరు నెలలు అయినప్పటికీ అధికారులు మరమ్మతులు చేయించిన దాఖలాలు లేవు. చెక్కలు విరిగిపోయి, రంధ్రాలు ఏర్పడ్డాయి. షటిల్ ఆడుతున్నప్పుడు రంధ్రాల్లో కాలు జారి పడి కొంతమంది క్రీడాకారులు ప్రమాదాలకు గురవుతున్నారు. బాత్రూం డోర్లకు గొల్లాల లేని పరిస్థితి ఉంది. తరుచు కరెంట్ అంతరాయం తలెత్తుతోందని క్రీడాకారుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నల్లా పైపులు పలగడం వలన నీరు వథాగా పోయి, నీటి సమస్య కూడా తలెత్తుతున్న దుస్థితి ఏర్పడుతోంది. సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని అధికారుల దష్టికి తీసుకెళ్లినా ఎలాంటి ఫలితం లేదని క్రీడాకారులు వాపోతున్నారు. మేయర్, కమిషనర్ ఇండోర్ స్టేడియం సమస్యలను పట్టించుకొని మౌలిక సదుపాయాలు కల్పించాలని క్రీడాకారులు కోరుతున్నారు .