Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జిల్లా కలెక్టర్‌కు వినతి
నవతెలంగాణ-ములుగు
ఎంపీటీసీల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వ దష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కషి చేయాలని కోరుతూ ఎంపీటీసీల ఫోరమ్ జిల్లా ప్రధాన కార్యదర్శి, అధికార ప్రతినిధి సయ్యద్ హుస్సేన్, బొల్లే భాస్కర్ జిల్లా కలెక్టర్‌కు సోమవారం వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. పంచాయతీ రాజ్ వ్యవస్థలో గ్రామలలో అభివద్ధి సంక్షేమ పథకల అమలుకు అత్యంత కీలకమైన మండల పరిషత్ సభ్యులుగా ఎన్నికై రెండేండ్లు గడచినా ఉత్సవ విగ్రహాలుగా మిగిలి పోయమన్నారు. 73 రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం నిధులు, విధులు అధికారాల రాక నిర్వీర్యమై పోతున్నామని తెలిపారు. ఎంపీటీసీలుగా నమ్మి ఓటేసిన గ్రామీణ ప్రజలకు మౌలిక సౌకర్యాలను కల్పించలేక పోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. మిగతా ప్రజాప్రతినిధుల మాదిరే ప్రజలచేత ఓటు వేయించుకోని ఎన్నికలలో గెలిచినా తమకు గౌరవ మర్యాదలు లేవన్నారు. 73వ రాజ్యాంగ సవరణ చట్టంలో ఆర్టికల్ 243జీ, 11వ షెడ్యూల్లో పేర్కొన్న 29 అంశాలను వెంటనే బదిలీ చేయాలని, చట్టబద్దంగా బాధ్యతలను, హక్కులను, అధికారాలను బదలాయించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే తలసరి గ్రాంట్‌ను రూ.10 లక్షలకు పెంచాలని, గ్రామ, మండల మహిళా సమాఖ్య సంఘాలకు చైర్పర్సన్లుగా మహిళా ఎంపీటీసీలను నియమించాలని, పాఠశాల విద్యా కమిటీల్లో ఎంపీటీసీలను మండల పరిషత్ పాఠశాలలకు చైర్మెన్లుగా నియమించాలని కోరారు. మండల పరిషత్ పాఠశాలల్లోని మధ్యాహ్న భోజన పథకానికి ప్రత్యేకంగా ఒక కమిటీని వేసి,దానికి ఎంపీటీసీ లను చైర్మన్ లు గా నియమించాలని,14వ స్టేట్ ఫైనాన్స్ కమిషన్ లో ఇద్దరూ ఎంపీటీసీ లను సభ్యులుగా నియమించాలని,ఎంపీటీసీ లకు ఇచ్చే గౌరవ వేతనాన్ని రూపాయలు 15 వేలకు పెంపుదల చేయాలని,రేషన్ షాపులపై పర్యవేక్షణ కమిటీలు వేసి,ఎంపీటీసీ లను దానికి చైర్మన్ లు గా నియమించాలని,అగ్రికల్చర్, మార్కెటింగ్ కమిటీలలో ఎంపీటీసీ లను గౌరవ సభ్యులుగా నియమిచాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.మండల పరిషత్ పాఠశాలలో ఆగస్ట్ 15 న ఎంపీటీసీ లకు పతాక ఆవిష్కరణ చేసే అవకాశం కల్పించాలని,15 వ ఆర్థిక సంఘము నిధులు గ్రామ పంచాయతీ లకు కేటాయించినవి కాకుండా అదనంగా ఎంపీటీసీ లకు,కూడా నిధులు కేటాయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీలు పాల్గొన్నారు.