Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కాంగ్రెస్ అనుబంధ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు సుధాకర్
నవతెలంగాణ-గోవిందరావుపేట
దళితబంధు పథకాన్ని ఉప ఎన్నికలో గెలుపు కోసం సీఎం కేసీఆర్ విసిరిన బిస్కెట్‌గా కాంగ్రెస్ పార్టీ అనుబంధ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు దాసరి సుధాకర్ అభివర్ణించారు. మండలంలోని రంగాపూర్, అమతండా, ఫ్రూట్ఫారం గ్రామాల్లో పార్టీ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ రసపుత్ సీతారాం నాయక్ ఆధ్వర్యంలో దళిత గిరిజన ఆత్మ గౌరవ దండోర కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా సుధాకర్ విచ్చేసి మాట్లాడారు. దళిత, గిరిజనులకు సీఎం కేసీఆర్ చేసిన మోసాలను వివరిస్తూ ఇంటింటికీ తిరుగుతూ రాష్ట్రంలోని అర్హులందరికీ దళిత, గిరిజన బంధు రావాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గడప, గడపకు తిరుగుతూ ఉప ఎన్నిక కోసం హుజురాబాద్ నియోజకవర్గంలో దళితుల కొరకు దళిత బంధు అనే కొత్త పథకాన్ని అందుబాటులోకి తెచ్చారని, నిజంగా దళితుల మీద కేసీఆర్ గారికి చిత్తశుద్ధి ఉంటే ఇదివరకే ఇస్తానని చెప్పిన దళితులకు 3 ఎకరాల భూమి ఇవ్వమని, అలాగే దళిత ముఖ్యమంత్రిని చేస్తానని చేసిన మొదటి వాగ్దానం నెరవేర్చమని అన్నారు. నిజంగా దళితులపై ప్రేమ ఉంటే, రాష్ట్రంలోని దళితులందరికి దళిత బందు ఇవ్వాలి కానీ, ఉప ఎన్నిక జరిగే హుజురాబాదులోనే ఇస్తున్నాడంటే ఇప్పటికైనా ప్రజలు అర్ధం చేసుకోవాలన్నారు. ఆర్ధికంగా, సామాజికంగా దళితులు మరియు గిరిజనులు ఇంకా వెనుకపడి ఉన్నారు కనుక రాష్ట్రంలోని దళిత గిరిజనులు అందరికి వర్తించేలా దళిత- గిరిజన బంధు పథకం ద్వారా ప్రతి కుటుంబానికి రూ.10 లక్షలు అందించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు కణతల నాగేందర్రావు, కొంపెల్లి శ్రీనివాస్‌రెడ్డి, పాలడుగు వెంకటకష్ణ, సూదిరెడ్డి జనార్ధన్‌రెడ్డి, జెట్టి సోమయ్య, ఎంపీటీసీలు గోపిదాసు ఏడుకొండలు, గుండెబోయిన నాగలక్ష్మి అనిల్ యాదవ్, చాపల ఉమాదేవి, లకావత్ జుమ్మిలాల్, బానోత్ లక్ష్మీ, లకావత్ జవహర్ లాల్, బానోత్ శ్రీనివాస్, భూక్య వసురు, భూక్య మంగయ్య, బానోత్ సమ్మయ్య, బానోత్ రంగమ్మ, లకావత్ శారద, లకావత్ హాలి, సూడి సత్తిరెడ్డి, కట్ల జనార్ధ్దన్‌రెడ్డి, బానోత్ భాయీజాన్, రసపుత్ బీబీ, లకావత్ స్వరూప, తదితరులు పాల్గొన్నారు.