Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తొర్రూరు
గణేష్ విగ్రహ నిమజ్జనానికి కట్టుదిట్టంగా ఏర్పాట్లు చేయాలని డీఎస్పీ వెంకట రమణ, చైర్మెన్ మంగళపల్లి రామచంద్రయ్య అన్నారు. డివిజన్ కేంద్రంలోని పెద్ద చెరువులో వినాయక విగ్రహాల నిమజ్జనం ఏర్పాట్లను సీఐ కరుణాకర్‌రావు, కమిషనర్ గుండె బాబు, తహసీల్దార్ రాఘవరెడ్డితో కలిసి పర్యవేక్షించారు. తొర్రూరు పెద్ద చెరువు వద్ద కల్పించాల్సిన వసతులపై అధికారులకు సూచనలు చేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ, సీఐ మాట్లాడారు. వాహనాలు వచ్చే దారులన్నిటికీ మరమ్మతు చేయాలన్నారు. విద్యుత్తు దీపాలు ఏర్పాటు చేయాలని, పెద్ద విగ్రహాల నిమజ్జనానికి అవసరమైతే క్రేన్లు వినియోగించాలని, తదితర సూచనలు చేశారు. రెవెన్యూ అధికారుల వద్ద సమాచారం ఉండాలని స్పష్టం చేశారు. నిమజ్జన ప్రాంతంలో ప్రత్యేక పారిశుద్ధ్య చర్యలు చేపట్టి వైద్య శిబిరం ఏర్పాటు చేయాలని తెలిపారు. గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. విద్యుత్తు సమస్య రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, విద్యుద్దీపాలు ఏర్పాటు చేయాలని, నిమజ్జన ప్రాంతంలో తాగునీటి వసతి కల్పించాలని, 5 రోజుల్లో పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఎస్సై గండ్రాతి సతీష్, వైస్ చైర్మెన్ సురేందర్‌రెడ్డి, కౌన్సిలర్లు ఎన్నమనేని శ్రీనివాసరావు, కొలుపుల శంకర్, నాయకులు దొంగరి శంకర్, ధరావత్ జైసింగ్, బిజ్జాల అనిల్, నల్లపు రాజు తదితరులు పాల్గొన్నారు.