Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తొర్రూరు
కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న తప్పుడు విధానాలను ప్రతిఘటించాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు అలువాల వీరయ్య కోరారు. మండల కేంద్రంలో సోమవారం నిర్వహించిన మండల కమిటీ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం రైతాంగ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతోందని విమర్శించారు. కుల, మతాల పేరుతో ప్రజలను చీలుస్తూ ఓట్ల కోసం ఘర్షణలు సష్టిస్తోందని మండిపడ్డారు. అలాగే కార్మికుల హక్కులను కాలరాస్తోందని ధ్వజమెత్తారు. నీచ రాజకీయాల్లోకి దిగజారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో రైతులకు వ్యతిరేకంగా చట్టాలను తీసుకొచ్చి భూమికి, రైతులకు మధ్య సంబంధం లేకుండా చేయాలని చేస్తోందని తెలిపారు. తక్షణమే కార్మిక వ్యతిరేక విధానాలను ఆపకపోతే కేంద్ర ప్రభుత్వానికి గుణపాఠం చెప్పక తప్పదన్నారు. కేంద్ర ప్రభుత్వ తప్పుడు విధానాలకు వ్యతిరేకంగా అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఈనెల 27న తలపెట్టిన భారత్ బంద్‌ను పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. సమావేశంలో పార్టీ మండల కార్యదర్శి బొల్లం అశోక్, నాయకులు యాకూబ్, మార్క సాంబయ్య, సోమిరెడ్డి, దర్గయ్య, బోర స్వామి తదితరులు పాల్గొన్నారు.