Authorization
Sat March 22, 2025 03:32:32 pm
నవతెలంగాణ-నెల్లికుదురు
ప్రజలను మోసం చేస్తే సహించబోమని టీడీపీ మహబూబాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షుడు కొండపల్లి రామచంద్రరావు, ఎస్సీ సెల్ రాష్ట్ర విభాగ ప్రధాన కార్యదర్శి కడారి ఐలయ్య తెలిపారు. మండల కేంద్రంలోని విశ్రాంతి భవనంలో పార్టీ మండల అధ్యక్షుడు భూక్యా సోమన్న అధ్యక్షతన సోమవారం నిర్వహించిన సమావేశానికి రామచంద్రరావు, ఐలయ్య హాజరై మాట్లాడారు. కల్లబొల్లి మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చి ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలం చెందారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణను విద్యార్థులు పోరాడి సాధించుకోగా సీఎం యువతను పట్టించుకోవడంలో నిర్లక్ష్యం చేస్తున్నారని విమర్శించారు. ఉపఎన్నికలు వచ్చినా నియోజకవర్గంలో మాత్రమే అమలు కాని హామీలను పెట్టి ప్రజలను మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితబంధను రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని, బీసీ బంధు ఏర్పాటు చేసే అర్హులను ఆదుకునేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమావేశంలో పార్లమెంటరీ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి ప్రేమ్చంద్, బీసీ సెల్ రాష్ట్ర నాయకుడు తాళ్ల ప్రభాకర్, ఎస్సీ సెల్ రాష్ట్ర నాయకుడు హరికిషన్నాయక్, పెరుమాండ్ల శ్రీనివాస్, బోలు ముత్తయ్య, తదితరులు పాల్గొన్నారు.