Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మట్టెవాడ
మహిళల రక్షణ కల్పించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఐద్వా నాయకురాలు నలిగంటి రత్నమాలు అన్నారు. సోమవారం చిన్నారిపై లైంగికదాడి చేసి హత్య చేసిన ఘటనను నిరసిస్తూ రామన్నపేటలో ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు చేసిన పక డ్బందీగా అమలు చేయకపోవడంతో మహిళలపై అఘా యీత్యాలు నిత్యం జరిగుతున్నాయని వాపో యారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు భవాని, విజయ, హుస్సేన్, కోమల, అరూరి కుమార్ పాల్గొన్నారు.
నిందితుడిని శిక్షించాలి
నవతెలంగాణ-నర్సంపేట
చిన్నారిపై లైంగికదాడికి పాల్పడి హత్య చేసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని ఎఐఎఫ్డీఎస్ డివిజన్ కార్యదర్శి మార్త నాగరాజు అన్నారు. సోమవారం స్థానిక ఓంకార్ భవనంలో సంఘం ఆధ్వర్యంలో చిన్నారి హత్యోందతాన్ని నిరసిస్తూ మౌనం పాటించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం మహిళల రక్షణకు చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలన్నారు. బాధిత కటుంబాన్ని ప్రభుత్వం ఆదుకుని రూ.లు 50 లక్షలివ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకుడు ఓంటేరు రాజు, రాకేష్, హేమంత్ బాబు, అనిల్ పాల్గొన్నారు.
నవతెలంగాణ-ఖిలా వరంగల్
ఆరేళ్ల చిన్నారిపై లైంగిక దాడి చేసి హత్య చేసిన నిందితులను వెంటనే శిక్షించాలని సోమవారం కరీమాబాద్‌లోని అంబేద్కర్ భవన్లో అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా రెండు నిమిషాలు మౌనం పాటించి సంతాపం తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు బొమ్మల అంబేద్కర్, తెలంగాణ రామా బారు అంబేద్కర్ ఉమెన్స్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షురాలు తరాల రాజమణి, నాయకులు కడారి కుమార్, ఎరుకల మహేందర్, జక్కుల రాజు, గోకారం సురేష్, తరాల రవితేజ, బొమ్మల రాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
నవతెలంగాణ-వేలేరు
మల్లికుదుర్లలో చిన్నారిపై లైంగిక దాడి చేసి హత్య చేసిన నిందితుడిని శిక్షించాలనికొవ్వొత్తులతో నిరసనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో విజరు చందర్, రాజు, రాకేష్, ప్రశాంత్, మధు, రాము, ప్రవీణ్, మహేష్, శశి, మహేందర్, సాయి, శ్రీకాంత్, రఘు, ప్రశాంత్ రెడ్డి, రాజిరెడ్డి, సల్మాన్ ఖాన్, సాంబరాజు తదితరులు పాల్గొన్నారు
నవతెలంగాణ-శాయంపేట
చిన్నారిపై అత్యాచారం చేసి హత్య చేసిన నిందితుడిని శిక్షించాలని కొప్పులలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ.. అమ్మ కడుపులో నుండే ఆడపిల్లకు రక్షణ కరువైందని, ఇలా అయితే భవిష్యత్తులో అమ్మని చూడలేమన్నారు. ఈ ఘటనలో నిందితులను కఠినంగా శిక్షించి ఇంకోసారి ఇలాంటి చర్యలు పునరావతం కాకుండా చర్యలు తీసుకోవాలనానరు.
నవతెలంగాణ-ఐనవోలు
చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడి హత్య చేసిన నిందితుడిని శిక్షించాలని మండల కేంద్రంలో కాంగ్రెస్ నాయకులు కొవ్వోత్తులతో నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండలాధ్యక్షుడు వడిచర్ల శ్రీనివాస్, గ్రామ శాఖ అధ్యక్షుడు బరిగల భాస్కర్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బరిగల భరత్ కుమార్, మహమ్మద్ యాకూబ్ పాషా, బరిగల పాశం సమ్మయ్య, కాటబోయిన.సంపత్ తదితరులు పాల్గొన్నారు.