Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - పోచమ్మ మైదాన్
గ్రేటర్ వరంగల్ నగరంలోని సమస్యలు పరిష్కరించాలని ప్రధాన సమావేశం కార్యాలయం ఎదుట సోమవారం సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అనంతరం కమిషనర్ ప్రావీణ్య కి నాయకులు సమస్యల పరిష్కారం కోసం వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర నాయకులు నలిగంటి రత్నమాల, జిల్లా కార్యదర్శి రంగన్న, జిల్లా కమిటీ సభ్యులు ముక్కెర రామస్వామి, అక్కినపల్లి యాదగిరి, సింగారపు బాబు, ఏరియా కార్యదర్శులు మాలోతు సాగర్, ఎం డి బషీర్ అహ్మద్, అంబాల రవి, మేకల లింగన్న, గోవర్ధన్ రాజు, విజయ తదితరులు పాల్గొన్నారు.
డంపింగ్ యార్డును ఎత్తివేయాలి
పోతన నగర్ వాసులు సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో కాలనీలోని డంపింగ్ యార్డును ఎత్తేయాలని బైఠాయించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలికి చేరకుని సర్దిచెప్పారు. అనంతరం కమిషనర్‌కి కాలనీవాసులు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో పొనుగంటి నిరంజన్, పుల్ల వీరమణి, సతీష్, అజరు, లావణ్య, శారద, స్వప్న, రోజా తదితరులు పాల్గొన్నారు.