Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హన్మకొండ
కొత్త జిల్లాల జిల్లా పరిషత్లో ఉద్యోగుల ఉపాధ్యాయుల ప్రావిడెంట్ ఫండ్ ఖాతాలు బదిలీ చేసి నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి కే సోమశేఖర్ డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్త ఆందోళనలో భాగంగా సోమవారం వరంగల్, హనుమకొండ టీఎస్ యూటీఎఫ్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో జెడ్పీ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నూతన జిల్లాలకు జిల్లా ప్రజా పరిషత్ పాలకవర్గాలు ఉద్యోగ వర్గీకరణ చేశారన్నారు. వేతనాలు కూడా నూతన జిల్లాల ట్రెజరీల ద్వారానే చెల్లించబడుతున్నాయని తెలిపారు. కానీ ప్రావిడెంట్ ఫండ్ ఖాతాలు ఇంకా ఉమ్మడి జిల్లా కేంద్రంగానే నిర్వహించబడటంతో పీఎఫ్ మంజూరులో ఉపాధ్యాయులు, ఉద్యోగులు సమస్యలు ఎదుర్కొంటున్నారన్నారు. దీంతో తమ ఖాతాల నిర్వహణ పట్ల ఉద్యోగులు తీవ్ర ఆందోళనలో ఉన్నట్లు తెలుస్తోందని, వెంటనే పీఎఫ్ ఖాతాలను నూతన జిల్లాల జిల్లా పరిస్థితులకు బదిలీ చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం హనుమకొండ, వరంగల్ జిల్లాల సీఈఓలకు పలు డిమాండ్లతో వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో టీఎస్ యూటీఎఫ్ హనుమకొండ, వరంగల్ జిల్లాల బాధ్యులు సీహెచ్ రవీందర్ రాజు, బద్దం వెంకట్రెడ్డి, పెండేం రాజు, సీహెచ్ రఘుపతి రెడి,్డ ఉభయ జిల్లాల నాయకులు ఏం సదాశివరెడ్డి, సీఎస్ఆర్ మల్లిక్, టీవీ సత్యనారాయణ, ఏం దామోదర్ తదితరులు పాల్గొన్నారు.