Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి యార ప్రశాంత్
నవతెలంగాణ-నర్సంపేట
పెండింగ్లోని ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి యార ప్రశాంత్ డిమాండ్ చేశారు. సోమవారం పట్టణంలోని పలు విద్యా సంస్థలను ఎస్ఎఫ్ఐ బందం సందర్శించింది. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో చిన్న, చిన్న ప్రైవేటు జూనియర్ కాలేజీల పరిస్థితి దారుణంగా ఉందన్నారు మూడేండ్ల నుంచి ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు విడుదల చేయకపోవడం సిగ్గుచేటన్నారు. బంగారు తెలంగాణ పేరుతో విద్యార్థులకు భవిష్యత్తే లేకుండా టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తోందన్నారు. కరోనా కాలంలో చిన్న ప్రైవేట్ కళాశాలను ఆదుకోవాల్సింది పోయి, కార్పొరేట్ కాలేజీలకు తొత్తుగా మారిందని విమర్శించారు. స్కాలర్షిప్స్ రాక పేద విద్యార్థులు పనుల్లోకి వెళ్ల్లాల్సిన పరిస్థితులను దాపురించాయని వాపోయారు. ప్రభుత్వానికి ఎలక్షన్లపై ఉన్న శ్రద్ధ, విద్యా వ్యవస్థ పట్ల లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా పెండింగ్లోని ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేనియెడల ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా ప్రతినిధులను అడ్డుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు పరపాక సతీష్, అనుశ్రీ, అనుప, రమ, కళ్యాణి, శ్రీవాణి, విద్యార్థులు పాల్గొన్నారు.