Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పర్వతగిరి
చింత నెక్కొండలో అర్హులకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కేటాయించాలని, ఇటీవల పంపిణీ చేసిన లబ్ధిదారుల జాబితాను రద్దుచేయాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఈదునూరి వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన సోమవారం తహశీల్దార్ ఎస్కే మహబూబ్ ఆలీకి సోమవారం వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సర్వేనెంబర్ 273లో పన్నేండ్లుగా నివాసముంటున్న బుడగ జంగాలకే ఇళ్లు కేటాయించాలన్నారు. మండలంలోని అన్ని గ్రామాల ప్రజాప్రతినిధులు నిలువ నీడలేని బుడగ జంగాలకు న్యాయం జరిగేలా సహకరించాలని కోరారు. అవకతవకలపై వరంగల్ జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశామన్నారు. కార్యక్రమంలో ఆ సంఘం మండల కార్యదర్శి మాదాసి యాకూబ్, స్థానిక బుడగ జంగాలు రవి, శంకర్, బాబు, రామ్ చందర్, సప్న, ఐలమ్మ తదితరులు పాల్గొన్నారు.