Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎంపీటీసీల ఫోరం జిల్లా
అధ్యక్షుడు జల్తారి సంపత్
నవతెలంగాణ కలెక్టరేట్
తమ సమస్యలు పరిష్కరించాలని సోమవారం హనుమకొండ కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతుకు వినతి పత్రం అందజేసినట్టు ఎంపీటీసీల ఫోరం జిల్లా అధ్యక్షుడు జాల్తారి సంపత్ తెలిపారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. ఎంపీటీసీలుగా ఎన్నికైనా ప్రజా ప్రతినిధులుగా తమకు గుర్తింపు లేదన్నారు. 73వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం ఎంపీటీసీలకు నిధులు, విధులు, అధికారాలు రాక నిర్విర్యమై పోతు న్నామని ఆవేదన వ్యక్తంచేశారు. పంచాయతీ రాజ్ వ్యవస్థ లో అత్యంత కీలకమైన తాము ప్రజలకు ప్రాథమిక సౌకర్యాలైన త్రాగునీరు, రోడ్లు, సానిటేషన్ , లైటింగ్ మొదలైన సౌకర్యాలు కల్పించలేకపోతున్నామని వాపోయారు. 73వ రాజ్యాంగ సవరణ చట్టంలో ఆర్టికల్ 243 జి 11వ షెడ్యూల్లో పేర్కొన్న 29 అంశాలను వెంటనే బదిలీ చేయాలన్నారు. చట్టబద్ధంగా ఎంపీటీసీలకు రావలసిన భాధ్యతలు, హక్కులను, అధికారాలను వెంటనే బదిలీ చేయాలని డిమాండ్ చేశారు.