Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పోచమ్మమైదాన్
జీడబ్ల్యూఎంసీలోని ఇంజనీరింగ్ సెక్షన్ లో ఉద్యోగుల కొరత అధికారులను, సిబ్బంది ని వేదిస్తోంది. పని భారంతో ఉద్యోగులు సతమతమౌతుండగా సకాలంలో ప్రజలకు సేవలు అందడం లేదు. ఈ విషయమై 'నవతెలంగాణ' ప్రత్యేక కథనం..
2011 జనాభా లెక్కల ప్రకారం మహా నగర పాలక సంస్థ పరిధిలో సుమారు 10 లక్షలకుపైగా జనాభా ఉన్నారు. అందుకు తగ్గట్టు ఉద్యోగులు ఉండాలని తెలుపుతూ ఆ మేరకు వివిధ విభాగాల్లో నియామకాలు చేపట్టాలని 2011లో ప్రభుత్వం జీఓ నెంబర్ 218ని జారీ చేసింది. ఇప్పటికి పదేండ్లు గడచినా పూర్తిగా స్థాయిలో అన్ని విభాగాల్లో ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయలేదు. శానిటే షన్, ఉధ్యానవన, ఇతర కొన్ని విభాగాల్లో మాత్రమే నామమాత్రంగా సిబ్బందిని నియ మించారు. కాగా కార్పొరేషన్లో 42 గ్రామా లను విలీనం చేశాక ఇంజనీరింగ్ శాఖ ఉద్యో గులపై పని భారం మరింతగా పెరిగింది. మొత్తం 66 డివిజన్లలో 407.70 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో బల్దియా విస్తరించి ఉంది. ఒక్కో ఏఈ సుమారు 4 నుంచి 8 వరకు డివిజన్ల బాధ్యతలను నిర్వర్తించాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో పని భారం విపరీతంగా పెరిగి అభివృద్ధి పనుల్లో తీవ్ర జాప్యం నెలకొంటోంది. వాస్తవానికి ఇంజనీ రింగ్ విభాగంలో ఒక చీఫ్ ఇంజనీర్, ముగ్గురు ఎస్ఈలు, ఆరుగురు ఈఈ, చీఫ్ ఇంజనీర్‌కు ఈఈ క్యాడర్లోని ఒక పీఏ ఉండాలి. అలాగే ఎస్ఈకి డీఈ క్యాడర్లో ముగ్గురు పీఏలు, 14 మంది డిప్యూటీ ఇంజ నీర్లు, 39 మంది సివిల్ ఇంజినీర్లు, ఆరు గురు ఎలక్ట్రికల్ ఇంజినీర్లు, ఏడుగురు గ్రాఫ్ట్స్ మెన్లు, 32 మంది వర్క్ ఇన్స్పెక్టర్లు, ఇద్దరు సీఏడీ/జీఐఎస్ ఆపరేటర్లు ఉండాలి. ఈ లెక్కన మొత్తం 114 మంది ఉద్యోగులు ఇంజనీరింగ్ సెక్షన్లో విధులు నిర్వర్తించాల్సి ఉండగా కేవలం 36 మంది మాత్రమే ఉన్నారు. తక్కువ సంఖ్యలో ఉద్యోగులుండ డం, నగర విస్తీర్ణం పెరుగుతున్న క్రమంలో ఎప్పటికప్పుడు పడుతున్న అదనపు భారంతో ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటు న్నారు. అభివృద్ధి పనులు సకాలంలో కావ డం లేదు. సమస్యను గత కమిషనర్లు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లినా నియామకాలు చేపట్టలేదు. ఇప్పటికైనా ప్రభుత్వం చొరవ తీసుకుని ఇంజనీరింగ్ విభాగంలో పూర్తి స్థాయిలో ఉద్యోగ ఖాళీలు భర్తీ చేసి సమస్య ను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.