Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ములుగు
ములుగు మండల అభివద్ధిలో, సంక్షేమ పథకాలు అమలులో అధికారులు, ప్రజాప్రతినిధులు అంకితభావంతో కృషి చేయాలని జెడ్పీ చైర్మెన్ కుసుమ జగదీశ్వర్ కోరారు. మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో ఎంపీపీ గండ్రకోట శ్రీదేవి సుధీర్ అధ్యక్షతన మంగళవారం నిర్వహించిన సర్వసభ్య సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై విద్య, వైద్యం, తాగునీరు, విద్యుత్, పంచాయతీరాజ్, ఆర్ అండ్ బీ, మత్స్య శాఖల ద్వారా జరుగుతున్న అభివద్ధి, సంక్షేమ పథకాలను సమీక్షించారు. ఆయా శాఖల అధికారులు నివేదికలు చదివి వివరించారు. ఆయా శాఖల పనితీరుపై ఎంపీటీసీలు అడిగిన ప్రశ్నలకు సంబంధిత శాఖ అధికారులు వివరణ ఇచ్చారు. అనంతరం జెడ్పీ చైర్మెన్ జగదీశ్వర్ మాట్లాడారు. అన్ని శాఖల్లోనూ అధికారులు సమర్థవంతంగా పనిచేసి ప్రజల మన్ననలు పొందాలని కోరారు. సమావేశాన్ని గౌరవించని అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రతి శాఖ అధికారి పూర్తి సమాచారంతో సమావేశానికి రావాలని కిందిస్థాయి అధికారులు కాకుండా మండల స్థాయి అధికారులు మాత్రమే సమావేశం హాజరుకావాలని సూచించారు. సభ్యులు అడిగిన ప్రతి సమస్యను వచ్చే సమావేశం అడిగి పరిష్కరించి వారి ముందు పెట్టేలా అధికారులు సిద్ధంగా ఉండాలన్నారు. కరోనా వల్ల 18 నెలల పాటు పాఠశాలలు మూసి వేసి తిరిగి ప్రారంభమైన సందర్భంగా పాఠశాలల్లోని సమస్యలను విద్యాశాఖ అధికారులు స్థానిక సర్పంచ్‌లు, ప్రజాప్రతినిధులు సహకారంతో పరిష్కరించుకోవాలని సూచించారు. ముఖ్యంగా గ్రామాల్లో ప్రజలు సీజనల్ వ్యాధుల బారిన పడకుండా వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి మెరుగైన వైద్యం అందించాలని కోరారు. గ్రామంలో 100 శాతం కరోనా వ్యాక్సిన్ పూర్తయ్యేలా ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు వైద్యాధికారులకు సహకరించాలని చెప్పారు. గ్రామాల్లో అసంపూర్తిగా ఉన్న మిషన్ భగీరథ పనులను వేగవంతంగా పూర్తి చేసి సమస్యలు తలెత్తకుండా తాగునీరు అందించేందుకు సంబంధిత అధికారులు కషి చేయాలని ఆదేశించారు. సమావేశానికి గైర్హాజరైన ఇరిగేషన్ అధికారులను ప్రభుత్వానికి సరెండర్ చేయాలని సభ ఏకగ్రీవంగా తీర్మానించింది. సమావేశంలో జెడ్పీటీసీ సకినాల భవాని, తహసీల్దార్ సత్యనారాయణ స్వామి, ఎంపీడీఓ శ్రీనివాస్, ఎంఈఓ శ్రీనివాస్, ఏఓ సంతోష్, బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ లక్ష్మణ్, సీడీపీఓ లక్ష్మి, ఏపీఓ ప్రసూన, ఏపీఎం రవి, డాక్టర్ జోత్స్నా దేవి, పశు వైద్య అధికారులు శ్రీధర్‌రెడ్డి, నవత, ఏఈలు అజిత్, లత, నర్సయ్య, నరేందర్, ఎంపీఓ హన్మంతరావు, తదితరులు పాల్గొన్నారు.