Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎన్ఎఫ్ఐడబ్ల్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
నేదునూరి జ్యోతి
నవతెలంగాణ-మట్టెవాడ
మహిళలు, బాలికలపై రోజురోజుకు దాడులు పెరిగిపోతున్నాయని, వాటిని అరికట్టడంలో ప్రభుత్వాలు, పాలకులు విఫలమవుతున్నారని ఎన్ఎఫ్ఐడబ్ల్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నేదునూరి జ్యోతి మండి పడ్డారు.హైదారాబాద్లో ఆరేండ్ల బాలికపై హత్యాచార ఘటనను నిరసిస్తూ మంగళవారం వరంగల్ హెడ్ పోస్ట్ ఆఫీస్ సెంటర్లో రాస్తారోకో నిర్వహించారు. ఈ సంద ర్భంగా ఆమె పాల్గొని మాట్లాడారు. హత్యాచార ఘటనల నిందితులను ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ద్వారా సత్వర శిక్షలు విధించాలని డిమాండ్ చేశారు. చట్టాలు కూడా కింది స్థాయి వరకు ప్రచారం చేయాలన్నారు. మద్యం, గంజాయి మత్తులో దాడులకు తెగబడుతున్నారని అన్నారు. మద్యం, మత్తు పదార్థాలను నిషేధించాలని ఉద్యమించినప్పటికీ పట్టించు కోవట్లేదని అన్నారు. మద్యం అమ్మకాలపై వచ్చే ఖజానాతో ప్రభుత్వాలు పాలన సాగించడం సిగ్గుచేటన్నారు. వెంటనే గంజాయి మాదక ద్రవ్యాలను నిషేధించాలని అన్నారు. సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి కర్రే బిక్షపతి, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి గన్నరపు రమేష్ మాట్లాడుతూ ఎన్ని చట్టాలొచ్చినప్పటికీ హత్యాచారాలు అగడంలేదని చట్టాలను కట్టుదిట్టం చేయాలని డిమాండ్ చేశారు. ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు ల్యాదల్ల శరత్ మాట్లాడుతూ ఇటీవల విద్యార్థినులపై ప్రేమ పేరుతో దాడులు పెరిగిపోయాయని అన్నారు. వారికి పకడ్బందీ రక్షణ కల్పించాలన్నారు. మహిళా సమాఖ్య వర్కింగ్ ప్రెసిడెంట్ రహెల, జిల్లా కౌన్సిల్ సభ్యులు బద్రి విజయ, విక్టోరియా, సువర్ణ, శోభ, దివ్య, ప్రజానాట్యమండలి జిల్లా ప్రధాన కార్యదర్శి దామెర కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.
నిందితుడిని కఠినంగా శిక్షించాలి
నవతెలంగాణ-పర్వతగిరి
గిరిజన బాలికపై హత్యాచార ఘటనకు ఒడిగట్టిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని సీఐటీయూ మండల కన్వీనర్ జిల్లా రమేష్, కేవీపీఎస్ వరంగల్ జిల్లా సహాయ కార్యదర్శి పోడేటి దయాకర్ డిమాండ్ చేశారు. మండల కేంద్రంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. హైదరాబాద్ సింగరేణి కాలనీలో బాలికపై అతి దారుణంగా హత్యాచారానికి పాల్ప డడం దుర్మార్గమన్నారు. హత్యాచార ఘటనలను అరికట్టడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయన్నారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారణ జరిపించి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. గిరిజన ప్రజాప్రతి నిధులు, మంత్రులు వెంటనే ఈ ఘటనపై స్పందించాలని కోరారు. నాయకులు బొట్ల శ్రీధర్ , అశోక్ పాల్గొన్నారు.
నిందితుడిని కఠినంగా శిక్షించాలి : సుమన్
నవతెలంగాణ-స్టేషన్ఘనపూర్
హైదరాబాద్లో గిరిజన బాలికపై హత్యాచార ఘటన నిందితుడిని కఠినంగా శిక్షించాలని లంబాడా హక్కుల రాష్ట్ర కార్యదర్శి లునావత్ సుమన్ నాయక్ డిమాండ్ చేశారు. మంగళవారం డివిజన్ కేంద్రంలో ఆయన విలేకరులతో మాట్లాడానేజ మహిళల రక్షణ కోసం ఎన్ని చట్టాలున్నా వాటిని వేగంగా అమలు చేయక పోవడం, న్యాయం అందించడంలో జరిగే జాప్యం, నిర్లక్ష్య కారణంగా ఈలాంటి ఘటనలు పునరావృతమవుతున్నాయన్నారు. నేర దర్యాప్తులో రాజకీయ జోక్యం, కుల, వర్గవివక్షలు సామాన్యు లకు న్యాయం అందని ద్రాక్షగా మారిందని ఆవేదన వ్యక్తంచేశారు. బాదిత కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలవాలని, వెంటనే ఇరవై లక్షల రూపాయల ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఓబీసీ సెల్ నాయకులు చల్లా తిరుపతి, బేడ బుడిగ జంగాల నాయకులు సిరిగిరి అనిల్, తదితరులు పాల్గొన్నారు.