Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మట్టెవాడ
వీఆర్ఎస్ ద్వారా రైటైర్డ్ ఉద్యోగుల కు రావాల్సిన 14 రకాల ప్రయోజనాలను వెంటనే పరిష్కరించాలని ఆల్ ఇండియా అసిస్టెంట్ జనరల్ సెక్రటరీ, రాష్ట్ర అధ్యక్షుడు జె సంపత్రావు డిమాండ్ చేశారు. బీఎస్ ఎన్ఎల్ ఎంప్లాయీస్, ఏఐబీడీపీఏ, సీసీడబ్ల్యూఎఫ్ కార్మికుల సమస్యల పరిష్కారానికి వరంగల్ జిల్లాలో బీఎస్ఎన్ఎల్ భవన్ ఎదుట మంగళవారం భోజనం విరామ సమయంలో ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన పాల్గొని మాట్లాడుతూ... ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ఆపాలని, ప్రతి నెల చివరి తేదీన ఉద్యోగులకు జీతాలు చెల్లించాలని, మూడవ వేతన సవరణ అమలు చేయాలని అన్నారు. వేతన సవరణ నుండి వేరుచేసి 15శాతం ఫిట్మెంట్ పెన్షన్లు అందించాలని డిమాండ్ చేశారు. లేదంటే ప్రతిరోజు ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీఎస్ఎన్ఎల్ ఎంప్లాయిస్ యూనియన్ జిల్లా కార్యదర్శి బుర్ర శ్రీనివాస్, ఏఐబీడీపీఏ జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు,సీసీడబ్ల్యూఎఫ్ జిల్లా కార్యదర్శి బాబు, బీఎస్ఎన్ఎల్ ఎంప్లాయిస్ యూనియన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ సంజీవ, బీఎస్ఎన్ఎల్ ఉద్యోగులు ధర్మారావు గురుమూర్తి, వీరయ్య, తదితరులు పాల్గొన్నారు.