Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జిల్లా అదనపు కలెక్టర్ దివాకర్
నవతెలంగాణ-భూపాలపల్లి
కిశోర బాలికలు, గర్భిణీలు, బాలింతలు, ఐదు సంవత్సరాల్లోపు పిల్లల్లో పోషకాహార లోపం లేకుండా చూడటమే పోషణ అభియాన్ కార్యక్రమం లక్ష్యమని, దీనిని విజయవంతం చేయడానికి లైన్ డిపార్ట్మెంట్ అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా అదనపు కలెక్టర్ దివాకర్ అన్నారు. జాతీయ పోషణ మాసం కార్యక్రమాల్లో భాగంగా మంగళవారం సింగరేణి క్లబ్ హౌస్‌లో జెడ్పిటిసిలు, ఐసీడీఎస్ సూపర్వైజర్లు, ఆరోగ్యశాఖ అధికారులు, లైన్ డిపార్ట్మెంట్తో సమావేశం నిర్వహించారు. ముందుగా పోషణ అభియాన్ కార్యక్రమం పై ప్రతిజ్ఞ చేశారు. అనంతరం పోషణ అభియాన్ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించి ఆయన మాట్లాడారు. జిల్లాలో చిన్నపిల్లలు ఎవరూ కూడా పోషకాహారలోపంతో బాధపడకూడదని, అంగన్వాడి సిబ్బంది చిన్నపిల్లలకు, బాలింతలకు, గర్భిణులకు సరైన పోషణ అందించడంలో సమన్వయంతో పనిచేయాలన్నారు. పోషకాహార లోపం లేని సమాజం నిర్మించడమే పోషణ అభియాన్ ముఖ్య ఉద్దేశమని అన్నారు. సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్,బీసీ వెల్ఫేర్,ఎస్సి వెల్పేర్ పాఠశాలలలో పాఠశాల ప్రార్థనా సమయంలో పోషణ అభియాన్ పై స్లోగన్ రూపంలో బాలబాలికలకు అవగాహన కల్పించాలన్నారు. ఆర్డీవో శ్రీనివాస్, జిల్లా ఇన్చార్జి సంక్షేమ అధికారి కే. సామ్యుల్, ఎస్సీ సంక్షేమ అధికారి సునీత, మల్హర్రావు జడ్పిటిసి కోమల, తదితరులు పాల్గొన్నారు.
గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి
నవతెలంగాణ-గణపురం
గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అడిషనల్ కలెక్టర్ దివాకర్ పేర్కొన్నారు. మంగళవారం మండలం లోని 17 గ్రామాల్లో అధికారులతో కలిసి సుడిగాలి పర్యటన చేశారు. చెల్పూర్, లక్ష్మారెడ్డిపల్లి, కర్కపల్లి గాంధీనగర్, కొండాపురం, గణపురం, బుద్ధారం తదితర గ్రామాల్లో పర్యటించారు. గ్రామంలోని నర్సరీ స్మశాన వాటిక, అవెన్యూ ప్లాంటేషన్, రోడ్లు తదితర అభివృద్ధి పనులను ఆయన పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు అనంతరం పాఠశాలను పరిశీలించి శానిటేషన్ గురించి అడిగి తెలుసుకున్నారు. కొన్ని గ్రామాలలో స్మశాన వాటిక పనులు పూర్తి కాలేదని పూర్తి చేయాలని కార్యదర్శులకు ఆదేశించారు. జెడ్పీ సీఈఓ శోభారాణి. మండల స్పెషల్ ఆఫీసర్ జిల్లా పశువైద్యాధికారి కుమారస్వామి, ఎంపీడీవో అరుంధతి, ఎంపీఓ రామకృష్ణ, పీఆర్ ఈఈ వెంకటేశ్వర్లు, ఏఈ నరేష్ సర్పంచులు మధుసూదన్‌రావు, పోట్ల నగేష్, దేవేందర్ విజయఅశోక్ రెడ్డి, ఐలోని శశిరేఖ రామచంద్రారెడ్డి, గండ్ర ఆగంరావు, భద్రయ్య కార్యదర్శులు నవీన్, హేమంత్ హరిచంద్ర రెడ్డి, చిరంజీవి పాల్గొన్నారు.