Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హన్మకొండ
సర్వాయి పాపన్న గౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా తీగల లక్ష్మణ్‌గౌడ్‌ను నియమించినట్లు సర్వాయి పాపన్న గౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర కన్వీనర్ శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. మంగళవారం నిర్వహించిన గౌడ సంక్షేమ సంఘం సమావేశంలో శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ సర్వాయి పాపన్న గౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా దర్గా కాజీపేట్‌కు చెందిన తీగల లక్ష్మణ్‌గౌడ్‌ను నియమించినట్లు తెలిపారు. అనంతరం నియామక పత్రాన్ని లక్ష్మణ్‌గౌడ్‌కు అందించారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ గౌడ్ మాట్లాడుతూ.. తనకు పదవీబాధ్యతలు అప్పగించిన సంఘం రాష్ట్ర చైర్మన్ సింగం సత్తయ్య గౌడ్, రాష్ట్ర గౌరవ అధ్యక్షులు వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్, సహకరించిన ఉమ్మడి జిల్లా గౌరవ అధ్యక్షులు పులి మోహన్‌గౌడ్, ఉమ్మడి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీపతి గోపిగౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి తాళ్ళ పెళ్లి రమేష్‌గౌడ్‌కు కృతజ్ఞతలు తెలిపారు.