Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జనగామ రూరల్
హైదరాబాదులోని సింగరేణి కాలనీలో ఆరేండ్ల బాలికపై జరిగిన హత్యాచార ఘటనలో నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం మండలంలోని ఎర్రగుంటతండా పరిధి దుబ్బతండాలో గిరిజనులు ర్యాలీ నిర్వహించారు. నిందితుడిని అరెస్టు చేసి చట్టపరిధిలో శిక్షించాలని కోరారు. సర్పంచ్ గుగులోతు మంజుల, వార్డు సభ్యురాలు విమల, రమావత్ వాసు, నాయకులు భాస్కర్, నరసింహ, మాలోతు రాజు, తదితరులు పాల్గొన్నారు.
నిందితున్ని ప్రజాక్షేత్రంలో ఉరితీయాలి
నవతెలంగాణ-పాలకుర్తి
ఆరేండ్ల బాలికపై హత్యాచారానికి ఒడిగట్టిన నిందితుడిని ప్రజాక్షేత్రంలో ఉరితీయాలని జనసేన నియోజకవర్గ నాయకులు మేడిద ప్రశాంత్ డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన విలేకర్లతో మాట్లా డారు. ఘటన జరిగి నాలుగు రోజులు గడుస్తున్నా ఇప్పటికీ పాలకులు ఏ ఒక్కరు పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న హత్యాచారాలు, హత్యలపై ప్రభుత్వం అగ్రవర్ణాలకు ఓ న్యాయం అణగారిన వర్గాలకు మరో న్యాయం చేస్తున్న దని ఆరోపించారు. నిందితున్ని ఉరితీయాలన్నారు.
దిశకు జరిగినన్యాయం చైత్రకు జరగాలి
నవతెలంగాణ -మహాముత్తారం
హైదరాబాద్ లో బాలికపై జరిగిన హత్యాచార ఘటనలో నిందితుడిని ఉరి తీయాలని, దిశ ఘటనలో జరిగిన న్యాయం చైత్ర ఘటనలో జరగాలని కాంగ్రెస్ యువజన మండల నాయకులు బోడ బాలాజీ డిమాండ్ చేశారు. పెగడపల్లిలో భారీ ర్యాలీ నిర్వ హించి చైత్రకు కొవ్వొత్తులతో నివాళులర్పించారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం తరుపున డబుల్ బెడ్ రూమ్ ఇల్లు, ఇంట్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, కుటుంబానికి రూ.50లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. బోడ గణేష్ రాంసింగ్, జాటోత్ రవీందర్, గుగులోత్ జయపాల్, ప్రవీణ్, అరుణ్, అభిరామ్ పాల్గొన్నారు.
నిందితులను నడిరోడ్డుపై ఉరితీయాలి
నవతెలంగాణ-సంగెం
బాలికలపై హత్యాచారాలు, హత్యలు చేస్తున్న నిందితులను నడిరోడ్డుపై ఉరితీయాలని ఏఐఎఫ్డీ డబ్ల్యూ వరంగల్ రూరల్ జిల్లా కార్యదర్శి వంగాల రాగసుధ డిమాండ్ చేశారు. మంగళవారం మండలం లోని కుంటపల్లి గ్రామంలో రౌతు రేణుక అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడా రు. హైదరాబాద్ సింగరేణికాలనీలో బాలికపై జరిగి న ఘటన అత్యంత దారుణమన్నారు. నిందితుడిని ఎన్కౌంటర్ చేయాలన్నారు. చట్టాలను పకడ్బందీగా అమలు చేసి, ప్రత్యేక నిధులు కేటాయించాలని అన్నా రు. బాధిత కుటుంబానికి రూ.50లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎంసీపీఐ(యు) నాయకు లు ఇస్మాయిల్, రైతు సంఘం నాయకులు గోనే రామచందర్, శివకుమార్, గోనె సుస్మిత, రౌతురజిత, రౌతు శ్రీను, తదితరులు పాల్గొన్నారు.
నిందితున్ని బహిరంగంగా ఉరి తీయాలి
నవతెలంగాణ-మల్హర్రావు
నిందితున్ని బహిరంగంగా ఉరి తీయాలని తీన్మార్ మల్లన్న మండల కన్వీనర్ వోన్న తిరుపతిరావు డిమాండ్ చేశారను. మంగళవారం కొయ్యుర్ ప్రధాన రహదారిపై తీన్మార్ మల్లన్న కమిటీ సభ్యులు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా తిరుపతిరావు మాట్లాడుతూ గిరిజన బాలికపై జరిగిన హత్యాచార ఘటనలో పోలీసులు విచారణ పేరుతో కాలక్షేపం చేయడం సరికాదన్నారు. ప్రభుత్వం స్పందించి నిందితున్ని బహిరంగంగా ఉరి తీయాలని అన్నారు. లేదంటే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చెపడ తామని హెచ్చరించారు. తీన్మార్ మల్లన్న టీమ్ సభ్యులు మోహన్, ఆర్ని రాజబాబు పాల్గొన్నారు.