Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విద్యా సంస్థల చైర్మన్ వరదారెడ్డి
నవతెలంగాణ-హసనపర్తి
ఎస్సార్ విశ్వవిద్యాలయానికి నేషనల్ ఇనిస్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్ (ఎన్ఐఆర్ఎఫ్)లో 134వ ర్యాంకు రావడం హర్షణీయమని ఎస్సార్ విద్యా సంస్థల చైర్మన్ వరదారెడ్డి తెలిపారు. మండలంలోని అనంతసాగర్ సమీపంలోని ఎస్సార్ విశ్వవిద్యాలయం ఆవరణలో ఎస్సార్ విశ్వవిద్యాలయం వైస్ చాన్సిలర్ డాక్టర్ జీఆర్సీ రెడ్డి అధ్యక్షతన మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జాతీయ స్థాయి ఇంజనీరింగ్ విభాగంలో ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్‌లో ఎస్సార్ యూనివర్సిటీకి 134వ ర్యాంకు రాగా ఓవరాల్ విభాగంలో 150-200 ర్యాంక్ బ్యాండ్‌ను సాధించినట్లు తెలిపారు. వివిద అంశాల ప్రాతిపదికన వివిద విద్యా సంస్థలకు, యూనివర్సిటీ లకు ర్యాంకులు ఇస్తుందన్నారు. భారత ప్రభుత్వ విద్యా శాఖ మంత్రి దర్మేంద్ర ప్రధాన్ ఫేస్బుక్, యూట్యూబ్, ట్విట్టర్లో ప్రత్యక్ష ప్రసారం ద్వారా 9 సెప్టెంబర్ 2021న ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్‌లను ప్రకటించినట్లు తెలిపారు. ర్యాంకింగ్ సాధనకు కృషి చేసిన సిబ్బందిని అభినందించారు. సమావేశంలో డైరెక్టర్ ఆఫ్ ఎవాల్యూయేషన్ డాక్టర్ గురురావు, డీన్ డాక్టర్ మహేష్, రిజిస్ట్రార్ డాక్టర్ అర్చనారెడ్డి పాల్గొన్నారు.