Authorization
Mon Jan 19, 2015 06:51 pm
డబుల్ ఇండ్ల పనులు పూర్తి చేయాలి
వర్షాలకు దెబ్బతిన్న రోడ్ల నివేదిక
తయారు చేయాలి
అక్టోబర్ మొదటి వారంలో
డబుల్ ఇండ్ల ప్రారంభోత్సవాలు,
అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు
పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి
నవతెలంగాణ-పాలకుర్తి
పాలకుర్తి నియోజకవర్గంలో పెండింగ్ అభివృద్ధి పనులు పూర్తి చేయాలని, పనుల్లో పురోగతి సాధించాలని పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జిల్లా కలెక్టర్ సీహెచ్ శివలింగయ్య తో కలిసి అభివృద్ధి పనులపై అధికారులు ప్రజాప్రతి నిధులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ... గ్రామాల్లో నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పనులను పూర్తి చేయాలని, నీటి సౌకర్యం విద్యుత్ సమస్య పరిష్కరించేందుకు త్వరితగతిన చర్యలు చేపట్టాలని ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. వర్షాలకు దెబ్బతిన్న రోడ్లను మరమ్మతులు చేసేందుకు నివేదిక తయారు చేయాలని ఆర్ అండ్ బీ, పంచాయతీరాజ్ శాఖ అధికారులకు సూచించారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్ల తోపాటు రైతు వేదికలు, పల్లె ప్రగతి పనులను అక్టోబర్ మొదటి వారంలో ప్రారంభిస్తామని, అప్పటి వరకు పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. డబుల్ ఇండ్లలో సకల సౌకర్యాలు కల్పించేందుకు ఆయా శాఖల అధికారులు దృష్టి పెట్టాలన్నారు. అర్హులైన పేదలను ఎంపిక చేయాలని గ్రామాల్లో జాబితా ప్రదర్శించాలని సూచించారు. అభివృద్ధి పనుల్లో భాగంగా సీసీరోడ్లు, లింకు రోడ్ల పనులకు శంకుస్థాపనలు చేస్తామన్నారు. అధికారులు ప్రజా ప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ సమావేశంలో అడిషనల్ కలెక్టర్ హమీద్, జిల్లా పంచాయతీ అధికారి రంగాచారి, ఆర్డీఓ కృష్ణవేణి, ఎంపీపీ నల్ల నాగిరెడ్డి, జెడ్పీ ఫ్లోర్ లీడర్ పూస్కూరి శ్రీనివాసరావు ఐలమ్మ మార్కెట్ కమిటీ చైర్మెన్ ముస్కు రాంబాబు, టీిఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు పసునూరి నవీన్, జిల్లా కో ఆప్షన్ మెంబర్ ఎండీ మధార్, జీసీసీ మాజీ చైర్మెన్ ధరావత్ మోహన్ గాంధీనాయక్, సర్పంచ్ వీరమనేని యాకాంతా రావు, ఆయా మండలాల సర్పంచులు ఎంపీటీసీలు, వివిధ శాఖల డీఈలు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.