Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జెడ్పీ వైస్ చైర్మెన్ కళ్లెపు శోభరఘుపతిరావు
నవతెలంగాణ-భూపాలపల్లి
అనాథ పిల్లలకు అండగా ఉంటామని జయశంకర్ భూపాలపల్లి జెడ్పీ వైస్ చైర్మెన్ కళ్లెపు శోభరఘుపతిరావు భరోసా ఇచ్చారు. భూపాలపల్లి మండలం లోని పెద్దాపూర్ గ్రామానికి చెందిన గట్టు లక్ష్మి(40, పసరగొండ మంజుల(38) సోమవారం పిడుగుపాటుకు మృతిచెందిన విషయం తెలిసిందే. కాగా మంగళవారం బాధిత కుటుంబాలను జెడ్పీ వైస్ చైర్మెన్ పరామర్శించి ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు.
మెరుగైన విద్యనందించేందుకు కృషి
పిడుగుపాటుతో మృతిచెందిన పసరగొండ మంజుల పిల్లలు అనాథలయ్యారు. మంజుల భర్త వెంకటేష్ పదేండ్ల కిందట అనారో గ్యంతో మృతిచెందాడు. కూలి చేసుకుంటూ కుటుంబాన్ని పోషించు కుంటూ కూతురు సదాకు వివాహం జరిపించింది. అయినప్పటికీ కూతురు సదాతో పాటు కుమారులు సిద్ధు, అరుణ్ ఆలనాపాలన చూసేవారు కరువయ్యారు. కాగా మంజుల కుమారులకు మెరుగైన విద్యనందించేందుకు తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని, ప్రభుత్వం నుండి వచ్చే పథకాలను అందేలా పాటుపడతామని జెడ్పీ చైర్మెన్ భరోసానిచ్చారు. అనంతరం బాధిత కుటుంబానికి రూ.2వేల ఆర్థికసాయం అందజేశారు. ఆమెవెంట సర్పంచ్ మామిడి మొండయ్య, ఎంపీటీసీ పరిపాటి మహిపాల్ రెడ్డి, నాయకులు జక్క రాజు నారాయణరావు, శ్రీనివాస రావు, రాజేశ్వరరావు, సుధాకర్, దేవేందర్ రావు, తదితరులు ఉన్నారు.