Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ గ్రామాల్లో ఉదయం 7 నుంచి 8 వరకు
పంచాయతీ కార్యదర్శులు పనులు పర్యవేక్షించాలి
అ పంచాయతీరాజ్ శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా
నవతెలంగాణ- భువనగిరిరూరల్
లింగ నిర్ధారణ పరీక్షలు చట్టరీత్యా నేరం
డిప్యుటీ డీఎంహెచ్ఓ ఎం కొమురయ్య
నవతెలంగాణ-భూపాలపల్లి
లింగ నిర్ధారణ పరీక్షలు చట్టరీత్యా నేరమని, జైలు శిక్ష అనుభవించాల్సి వస్తుందని డిప్యూటీ డీఎంహెచ్ఓ ఎం కొమురయ్య అన్నారు. మంగళవారం జయశంకర్-భూపాలపల్లి లోని నర్సింగ్ హౌమ్లను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. రేడియోలజిస్ట్, గైనకాలజిస్ట్ రెఫరెన్స్ లేకుండా స్కానింగ్లు చేయొద్దన్నారు. అవసరమైన గర్భిణులకు మాత్రమే వారి అనుమతి తీసుకుని స్కానింగ్ చేయాలన్నారు. పిసిపిఎన్డిటి ఆక్ట్ ప్రకారం లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే వైద్యుడికి, చేయించిన కుటుంబ సభ్యులకు మూడేండ్ల జైలుశిక్ష, జరిమానా విధిస్తారని అన్నారు. గర్భిణులు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తూ వైద్యుల సలహాలు పాటించాలన్నారు. స్కానింగ్ రిపోర్టులు ఎప్పటికప్పుడు పిసిపిఎన్డిటి పోర్టల్ ఆన్లైన్ లో నమోదు చేయాలన్నారు. లింగ నిర్ధారణ పరీక్షలు చేయబడవని సూచించే పోస్టర్లు గానీ, రాతలు గాని పెట్టాలని ప్రోగ్రాం ఆఫీసర్ ఎం శ్రీదేవి తెలిపారు. డీపీహెచ్ఎన్ఓ వెంకటమ్మ, మాస్ మీడియా ఆఫీసర్ అన్వర్ పాల్గొన్నారు.