Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అర్హులైన పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణంతో పాటు, రూ 50 లక్షల తో సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన, చెన్నూరు లో రైతులకు ఉపయోగపడే రైతు వేదిక తోపాటు గ్రామపంచాయతీ భవనాన్ని, పెద్దతండ (బి)లో గ్రామపంచాయతీ భవనాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయా గ్రామాల సర్పంచులు పసులాది సుశీల, పుస్కూరి పార్వతి రాజేశ్వరరావు,జరుపుల మోజీ బాలు నాయక్ అధ్యక్షతన జరిగిన సభల్లో మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ రాష్ట్రంలో అమలవుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శమన్నారు. పథకాల అమలులో సీఎం కేసీఆర్ స్ఫూర్తిగా నిలిచాడని తెలిపారు. అర్హులైన పేదలందరికీ అభివద్ధి సంక్షేమ పథకాలను అమలు చేస్తుంటే సంక్షేమ పథకాల అమలును జీర్ణించుకోలేక ప్రతిపక్ష పార్టీలు అవాకులు చవాకులు ప్రదర్శిస్తున్నాయని ఆరోపించారు. 500 జనాభా కలిగిన ప్రతి తండాను గ్రామ పంచాయతీ చేసిన ఘనత సీఎం కేసీఆర్ కు దక్కిందని, గత పాలకులు అభివృద్ధి ప్రజా సంక్షేమాన్ని విస్మరించాయని తెలిపారు. రైతులకు సరిపడా సాగునీరుతో పాటు 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ ను అందిస్తున్న ఘనత తెలంగాణ ప్రభుత్వానికి దక్కిందన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాలు అభివద్ధి సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో అమలు కావడం లేదని, పింఛన్లు రూ.500 కు మాత్రమే పరిమితమయ్యాయని ఆరు నెలలకు ఒకసారి అందిస్తున్నారని తెలిపారు. తెలంగాణలో అర్హులైన వద్ధులకు వికలాంగులకు వితంతువులకు ఒంటరి మహిళలకు రూ 2016 నుండి 3016 ల వరకు అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌కు దక్కిందన్నారు. వచ్చే నెల నుండి 50 ఏళ్లు నిండిన అర్హులైన ప్రతి ఒక్కరికి రూ 2016లో పెన్షన్ అందిస్తున్నామని తెలిపారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం సకాలంలో పూర్తి చేసి అర్హులైన పేదలకు అందించాలని కాంట్రాక్టర్, అధికారులను ఆదేశించారు. కరోనా కట్టడికి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేసుకోవాలని సూచించారు. 18 సంవత్సరాలు పైబడిన వారందరికీ 15 రోజుల్లో వ్యాక్సిన్ ఇవ్వడం పూర్తి చేయాలని తెలిపారు. వ్యాక్సిన్ తీసుకున్నవారికి తీసుకొని వారి కుటుంబాలకు స్టిక్కర్లు వేస్తామని, వ్యాక్సిన్‌పై ఇంటింటి సర్వే చేసి స్టిక్కర్లు వేయాలని వైద్య శాఖకు ఆదేశించారు. మహిళలు కుటీర పరిశ్రమలను స్థాపించి ఆర్థికంగా ఎదగాలని సూచించారు. ప్రతి ఒక్కరి ఆరోగ్యాన్ని కాపాడేందుకు సీఎం కేసీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా మిషన్ భగీరథ కార్యక్రమంలో స్వచ్ఛమైన త్రాగు నీరు అందించేందుకు ఇంటింటి నల్ల ను విధించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ హమీద్, ఎంపీపీ నల్ల నాగి రెడ్డి, జడ్పీ ఫ్లోర్ లీడర్ పుస్కూరి శ్రీనివాసరావు, స్టేషన్ ఘన్పూర్ ఆర్డీవో కృష్ణవేణి, ఐలమ్మ మార్కెట్ కమిటీ చైర్మన్ ముస్కు రాంబాబు, జిల్లా కో ఆప్షన్ సభ్యులు ఎండడీ మదర్, రైతు బంధు సమితి మండల కోఆర్డినేటర్ విరమనేని యాకాంతరావు, తహశీల్దార్ విజయభాస్కర్, ఎంపీడీఓ వనపర్తి అశోక్ కుమార్, టీిఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు పసునూరి నవీన్, తొర్రూర్ సొసైటీ చైర్మన్ గోనె మైసిరెడ్డి, తొర్రూరు ఎంపీటీసీ లు మడిపల్లి కౌసల్య సోమయ్య,పుస్కూరి కళింగ రావు, వైస్ ఎంపీపీ ధార శారద శంకరయ్య,దుబ్బతండా ఎస్పీ సర్పంచ్ భూక్య యాకుబ్ నాయక్, తొర్రుర్ సొసైటీ వైస్ చెర్మెన్ బానోత్ రాందన్ నాయక్, ఉప సర్పంచ్ మారుజోడు సంతోష్, ఆకారపు ఉపేందర్, ఐలమ్మ మార్కెట్ కమిటీ డైరెక్టర్ వేల్పుల దేవరాజు, తదితరులు పాల్గొన్నారు.