Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు
నవతెలంగాణ-తొర్రూరు
అర్హులందరికీ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మంజూరు చేస్తామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలిపారు. మండలంలోని చీకటాయపాలెంలో ఆదివారం ఆయన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం రూ.30 లక్షల వ్యయంతో చేపట్టిన సీసీ రోడ్డు పనులకు, రూ.2.52 కోట్ల చేపట్టిన 52 డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణానికి కలెక్టర్ శశాంకతో కలిసి మంత్రి ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. సీఎం కేసీఆర్ కరోనా కష్టకాలంలోనూ పేదలకు కల్యాణలక్ష్మీ, ఆసరా పింఛన్లు, ఇతర అనేక సంక్షేమ పథకాలను కొనసాగిస్తున్నారని కొనియాడారు. సీఎం కేసీఆర్‌ను స్ఫూర్తిగా తీసుకుని తన వంతుగా ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నియోజకవర్గ ప్రజలకు నిత్యావసర సరుకులు అందించినట్టు తెలిపారు. ఆనందయ్య మందులు కూడా నియోజకవర్గ ప్రజలకు పంపిణీ చేశామని గుర్తు చేశారు. తొర్రూరుకు సొంత డబ్బులతో అంబులెన్స్ ఇప్పించానని, ప్రభుత్వ ఆస్పత్రిలో ఆక్సిజన్ బెడ్లు ఏర్పాటు చేయించానని వివరించారు. దళితబంధు పథకంతో పేదల ఆర్థిక అభివద్ధికి కషి చేస్తామన్నారు. గ్రామస్తుల కోరిక మేరకు పాలేరు వాగుపై చెక్‌డ్యామ్, హరిపిరాల రోడ్డులోని రైతుల విజ్ఞప్తి మేరకు ఒకటిన్నర కిలోమీటర్ల సూర్యాపేట రోడ్డు కనెక్టివిటీ త్వరలో చేపడతామని భరోసా ఇచ్చారు. అనంతరం చెర్లపాలెం గ్రామంలో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు, జిల్లా కలెక్టర్ శశాంక్ పరిశీలించారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ రమాదేవి, డీఆర్డీఏ పీడీ సన్యాసయ్య, పంచాయతీ రాజ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సురేష్, జిల్లా వైద్యాధికారి హరీష్‌రాజ్, ఉధ్యానవన శాఖ అధికారి సూర్యనారాయణ, జిల్లా పంచాయతీ అధికారి రఘువరన్, ఎంపీపీ తూర్పాటి చిన్న అంజయ్య, జెడ్పీ ఫ్లోర్‌లీడర్ మంగళపల్లి శ్రీనివాస్, మున్సిపల్ చైర్మెన్ రామచంద్రయ్య, డీసీసీబీ డైరెక్టర్, పీఏసీఎస్ చైర్మెన్ కాకిరాల హరిప్రసాదరావు, రైతు సమన్వయ సమితి మండల కోఆర్డినేటర్ అనుమాండ్ల దేవేందర్‌రెడ్డి, పార్టీ మండల అధ్యక్షులు పసుమర్తి సీతారాములు, పట్టణ పార్టీ అధ్యక్షుడు ఆర్ శ్రీనివాస్, నాయకులు చిదిరాల చంద్రయ్య, రామసహాయం కిషోర్‌రెడ్డి, డీఎస్పీ వెంకటరమణ, తహసీల్దార్ వేమిరెడ్డి రాఘవరెడ్డి, ఎంపీడీఓ భారతి, మున్సిపల్ కమిషనర్ గుండా బాబు, తదితరులు పాల్గొన్నారు.
పంచాయతీ కార్యదర్శులు సమస్యలు పరిష్కరించాలి
పంచాయతీ కార్యదర్శుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ ఆ సంఘం రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు రంజిత్ కుమార్ ఆధ్వర్యంలోని బృందం చీకటాయపాలెంలో మంత్రి దయాకర్‌రావును కలిసి వినతిపత్రం అందించింది. ఈ సందర్భంగా రంజిత్‌కుమార్ సమస్యలను వివరించారు. వినతిపత్రం ఇచ్చిన వారిలో సంఘం రాష్ట్ర కోశాధికారి రాజు, బాధ్యులు నర్మద, శ్రీనివాస్, విక్రమ్, శ్రీకాంత్, రాజేశ్వర్, వెంకటరమణ, సంపత్, సాయితేజ, దేవేందర్, పరమేష్ తదితరులు పాల్గొన్నారు.