Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వేడుకగా టీపీసీసీ కార్యదర్శి
నవతెలంగాణ-గోవిందరావుపేట
టీపీసీసీ కార్యదర్శి పైడాకుల అశోక్ జన్మదినం సందర్భంగా మండల కేంద్రంలోని హరిహర క్షేత్రానికి ఆధ్వర్యంలో ఆదివారం రూ.5 వేలు విరాళం అందించారు. తొలుత కాంగ్రెస్ పార్టీ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ సీతారాం నాయక్ ఆధ్వర్యంలో ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ నాయకులు అశోక్‌ను పూలమాలలతో ఘనంగా సత్కరించి భారీ కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా సీతారాం నాయక్ మాట్లాడారు. పేద కుటుంబాలకు అశోక్ అండగా నిలుస్తుండడంతో ఆయనకు నీరాజనాలు పడుతున్నట్టు తెలిపారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అశోక్‌ను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా నాయకులు కణతల నాగేందర్రావు, మండల ఉపాధ్యక్షుడు తేళ్ల హరిప్రసాద్, మండల ప్రధాన కార్యదర్శి వేల్పుగొండ పూర్ణ, మాజీ మండల అధ్యక్షులు కొంపెల్లి శ్రీనివాస్‌రెడ్డి, జెట్టి సోమయ్య, పాలడుగు వెంకటకష్ణ, జిలా యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు పెండెం శ్రీకాంత్, ఎస్టీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య సారయ్య, మండల యూత్ అధ్యక్షుడు చింత క్రాంతి, ఎస్టీ సెల్ మండల అధ్యక్షుడు భూక్య రాజు, ఎంపీటీసీలు గోపిదాసు ఏడుకొండలు, గుండెబోయిన నాగలక్ష్మి అనిల్ యాదవ్, సర్పంచ్‌లు లావుడ్య లక్ష్మీ జోగానాయక్, ముద్దబోయిన రాము, ఉపసర్పంచ్లు బద్దం లింగారెడ్డి, కట్ల జనార్ధన్‌రెడ్డి, జాటోత్ చంద్రకాంత్, రేగుల అరవింద్, వాసం శ్రావణ్, బొల్లు కుమార్, మద్దినేని వినరు, కృష్ణ, పాడియా రాజు, తదితరులు పాల్గొన్నారు.