Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చిన్నగూడూరు
మండలంలోని పగిడిపల్లి గ్రామానికి చెందిన డీలర్ శామకూరి మల్లికార్జున్ తండ్రి రాములు (80) గుండెపోటు తో ఆదివారం మృతి చెందగా ఎమ్మెల్యే రెడ్యానాయక్, టీఆర్ఎస్ పార్టీ డోర్నకల్ నియోజకవర్గ యువజన నాయకుడు రవిచంద్ర పూలమాల వేసి నివాళ్లర్పించారు. రాములు కుటుంబాన్ని పరామర్శించారు. రాములు మృతి బాధాకరమన్నారు. డీలర్ మల్లికార్జున్ తండ్రి రాములు కుటుంబానికి అండగా ఉంటామని తెలిపారు. మల్లికార్జున్ను పరామర్శించిన వారిలో ఎమ్మెల్యే వెంట టీఆర్ఎస్ పార్టీ మండల నాయకులు మూల మురళీధర్ రెడ్డి, వల్లూరి చెన్నారెడ్డి, ధారాసింగ్, మంగీలాల్, వెంకన్న, బాలమల్లు, రవీందర్, మల్లయ్య, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.