Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సీతక్కకు వినతిపత్రం అందజేత
నవతెలంగాణ-ములుగు
మున్నూరు కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని మున్నూరు కాపు సంక్షేమ సంఘం ములుగు నియోజకవర్గ కోఆర్డినేటర్ పిట్టల మధుసూదన్ ప్రభుత్వాన్నిడ ఇమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ఆధ్వర్యంలోని బృందం ఆదివారం నాడు ఎమ్మెల్యే సీతక్కను జిల్లా కేంద్రంలోని క్యాంప్ కార్యాలయంలో కలిసి వినతిపత్రం అందించింది. ఈ సందర్భంగా మధుసూదన్ మాట్లాడారు. రాష్ట్రంంలోని మున్నూరు కాపు కులస్తులు వ్యవసాయమే ప్రధాన వత్తిగా జీవిస్తున్నట్టు తెలిపారు. పంట మార్పిడి దశలో పంట పండితే సబ్బండ వత్తి వారు పంటపై ఆధారపడి కులవత్తులు కొనసాగేవని తెలిపారు. అప్పటి పరిస్టితులలో మున్నురుకాపుల కాపుల జీవనం సాఫీగా సాగేదని చెప్పారు. మున్నూరుకాపు కులస్తులు వ్యవసాయాన్ని వదలలేక, ఇతర వృత్తులపై ఆర్థిక స్థోమత లేక వెళ్లక, నైపుణ్య శిక్షణ అందక ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. మున్నూరు కాపు కులస్తుల అభ్యున్నతి కోసం కార్పొరేషన్ ఏర్పాటే ఏకైక మార్గమని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సీతక్క స్పందించారు. సమస్యను అసెంబ్లీలో చర్చిస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు నల్లెల్ల కుమారస్వామి పటేల్, మండల కోఆర్డినేటర్ సిరికొండ బలరాం పటేల్, చింతనిప్పుల భిక్షపతి, సుంకరి రవీందర్, తోట తిరుపతి, గందె శ్రీను, అకుతోట చంద్రమౌళి, కాపిడి ప్రభాకర్, పంచగిరి బాబురావు, ఎడ్ల సంపత్, పగడాల ఓంప్రకాష్, గందె మధు, గండ్రత్ శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.