Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జూడో ఫెడరేషన్
కోశాధికారి కైలాష్ యాదవ్
నవతెలంగాణ కాశిబుగ్గ
క్రీడల వల్ల శారీరక, మానసిక దఢత్వంతో పాటు ఒత్తిడిని దూరం చేసుకోవచ్చని జూడో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా కోశాధికారి బైరబోయిన కైలాష్ యాదవ్ అన్నారు. వరంగల్ రూరల్ గేమ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం ఓసిటీ మైదానంలో జరుగుతున్న రాష్ట్ర స్థాయి ఛాంపియన్ షిప్ పోటీలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన కబడ్డీ ఫైనల్ మ్యాచ్‌ని ప్రారంభించి మాట్లాడారు.
సుమారు 12 జిల్లాల నుండి కబడ్డీ, కోకో, వాలీబాల్, క్రికెట్ పోటీలలో పాల్గొనే క్రీడాకారులకు మంచి వసతులు కల్పించి నందుకు కతజ్ఞతలు తెలియజేశారు. వరంగల్ జిల్లా కేంద్రం ఈ ప్రాంతంలోనే ఏర్పాటు కావడం వల్ల ఓ సిటీ స్టేడియం క్రీడ హబ్ గా మారనుందని పేర్కొన్నారు. అనంతరం గెలుపొందిన విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో హ్యాండ్ బాల్ అంతర్జాతీయ క్రీడా కారుడు పోగుల అశోక్, కరాటే మాస్టర్ ధన్ రాజ్, కార్యనిర్వహణ కార్యదర్శి దుపాకీ సంతోష్ కుమార్, టీఅర్జీఏ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, కోచ్‌లు మహేష్, మల్లేష్, హరినాయక్, లింగమూర్తి, సుహాసిని, రాజు, సురేష్, వివిద జిల్లా క్రీడల ప్రముఖులు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు.