Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జిల్లా కలెక్టర్
సీహెచ్ శివలింగయ్య
నవతెలంగాణ-జనగామ
కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రత్యేక కార్యా చరణను వందశాతం పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ సీహెచ్ శివలింగయ్య అన్నారు. ఆదివారం కలెక్టర్ పట్టణంలోని 18, 19, 25 వార్డులతోపాటు జిల్లాలోని రఘునాధ పల్లి మండలం నిడిగొండలో ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్ కేంద్రాలను ఆయన ఆకస్మిక తనిఖీ చేసి ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ కరోనా వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కరోనా వచ్చినా ప్రాణాపాయం ఉండదన్నారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలని, ఇంటికి దగ్గరలో ఏర్పాటుచేసిన ప్రత్యేక వ్యాక్సినేషన్ డ్రైవ్‌ను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ప్రజాప్రతినిధులు, వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, ఆశా వర్కర్లు ఇంటింటికి తిరిగి వ్యాక్సిన్‌పై అవగాహన కల్పించాలని అన్నారు. వ్యాక్సిన్ కేంద్రాలకు వచ్చి, వ్యాక్సిన్ తీసుకొనేలా చైతన్యపరచాలని అన్నారు. ఇంటింటి సర్వే పకడ్బందీగా చేపట్టాలని, 18 ఏండ్లు పైబడిన వారి వివరాలు నమోదు చేసి, స్టిక్కర్‌ను ఇంటి గడపకు అంటించాలన్నారు. షెడ్యూల్ ప్రకారం వ్యాక్సినేషన్ ప్రక్రియ చేపట్టాలని అన్నారు. ముందస్తుగా విస్తృత ప్రచారం చేయాల న్నారు. వ్యాక్సిన్ కేంద్రాల్లో మౌళిక సదు పాయాలు కల్పించాలన్నారు. సిబ్బందికి తాగునీరు, భోజన సదుపాయం కల్పించాల న్నారు. జనగామ ఆర్డీఓ మధు మోహన్, డీఎంహెచ్ఓ ఏ మహేందర్, మునిసిపల్ కమిషనర్ నరసింహ, ఉప జిల్లా వైద్య, ఆరోగ్యాధికారులు అశోక్ కుమార్, డాక్టర్ కరుణశ్రీ, తదితరులు పాల్గొన్నారు.
గణపురం : జిల్లా వ్యాప్తంగా ప్రతి ఒక్కరూ కరోన వ్యాక్సిన్ తీసుకోవాలని ఇమ్యునైజేషన్ జిల్లా ప్రోగ్రాం అధికారి డాక్టర్ మమతాదేవి అన్నారు. ఆదివారం మండల కేంద్రంలో వ్యాక్సినేషన్ సరళిని పరిశీలించి ఆమె మాట్లాడారు. జిల్లా ఉన్నతాధికారులు వ్యాక్సినేషన్ ప్రక్రియపై ప్రత్యేక దృష్టి సారించారని , వారం రోజులు గా వ్యాక్సినేషన్ కార్యక్రమం ముమ్మరంగా కొనసాగుతోందన్నారు. పట్టణాలకే పరి మితం కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో కూడా వ్యాక్సిన్ వేస్తున్నట్టు తెలిపారు. 18 ఏండ్లు నిండిన యువతపై ప్రత్యేక దృష్టిసారించి నట్టు తెలిపారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా టీకా వేసుకోవాలని సూచించారు. ఈ అవ కాశాన్ని అందరూ సద్వినియోగం చేసు కోవాలని సూచించారు. జిల్లావ్యాప్తంగా శనివారం నాటికి 11731 మందికి వ్యాక్సిన్ వేసినట్టు తెలిపారు. మలేరియా ప్రోగ్రాం అధికారి ఉమాదేవి, డాక్టర్ శ్రీనాథ్ పాల్గొన్నారు.
మల్హర్రావు : కరోనా నియంత్రణలో భాగంగా మండలంలో ఇటీవల భూపాలపల్లి జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య తోపాటు జిల్లా వైద్యాధికారి పర్యటించి మండలవ్యాప్తంగా మొదటి, రెండవ డోస్ లు వందశాతం పూర్తి చేయాలని ఆదేశించారు. దీంతో మండలంలో ఎంపీపీ మల్హర్ రావు, జడ్పీటీసీ కోమల,స్పెషల్ అధికారి సుదర్శన్ రాథోడ్, ఎంపీడీఓ నరసింహమూర్తి, తహసీల్ధార్ శ్రీనివాస్ కోవిడ్ వ్యాక్సినేషన్ స్పెషల్ కేంద్రాలు నిర్వహించి వ్యాక్సినేషన్ వేగవంతం చేశారు. వల్లెంకుంటలో వందశాతం వ్యాక్సినేషన్ పూర్తి కావాలని పంచాయతీ కార్యదర్శి నరేష్ వైద్య సిబ్బందితో ఆదివారం ఇంటింటికి వెళ్లి కోవిడ్ వ్యాక్సిన్ వ్శేఆరు. ఇప్పటికే గ్రామంలో మొదటి డోస్ వందశాతం పూర్తియి, రెండవ డోస్ 50 శాతం పూర్తియినట్లుగా కార్యదర్శి నరేశ్ తెలిపారు.
మహాదేవపూర్ : మండల కేంద్రంలో సర్పంచ్ శ్రీపతిబాపు ఆధ్వర్యంలో పత్తర్ గట్టి, ఖాన్‌పురా, గుడ్‌మార్నింగ్ స్కూల్ ఏరియాలో టీకా శిబిరాలు ఆదివారం ప్రారంభించారు. వచ్చే నెల నుండి కోవిడ్ టీకా తీసుకోని వారి రేషన్ బియ్యం తగ్గించ నున్నట్టుసర్పంచ్ తెలిపారు. ఎంపీడీఓ శంకర్ నాయక్, ఎంపీఓ ప్రసాద్,జి ల్లా గ్రంథాలయ సంస్థ డైరెక్టర్ వెన్నంపల్లి మహేష్, ఏఎన్ఎంలు వెంకటమ్మ, హేమలత, ఆశావర్కర్లు పాల్గొన్నారు.
చిల్పూర్ : ్ మండలం లోని లింగంపల్లిలో ఆదివారం సర్పంచ్ ఏదు నూరి రవీందర్ ఆధ్వర్యంలో కోవిడ్ వ్యాక్సినేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. వ్యాక్సిన్ తోనే కరోనాకు అడ్డుకట్ట వేయొచ్చన్నారు. మొదటి డోస్, రెండో డోస్ ఇచ్చేందుకు క్యాంప్ ఏర్పాటు చేసినట్టు తెలిపారు. అనంతరం వైద్య సిబ్బంది ఎంపీహె3ర్ ఏఎం వై నిర్మల మాట్లాడారు. వ్యాక్సినేషన్ కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. గ్రామ కార్యదర్శి మాధవి వార్డుమెంబర్స్ పాల్గొన్నారు.